జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఘణపురం మండలం చేల్పూరులో గల ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ లో సోమవారం నాడు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగాఉందని అధికారులు తెలిపారు. 500 మెగావాట్ల పవర్ ప్లాంట్ లో ఈ పేలుడు చోటు చేసుకొంది.