అయ్యప్ప స్వామి గురించి భైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హిందూ దేవుళ్లపై.. మరీ ముఖ్యంగా అయ్యప్ప దేవుడి పుట్టుకపై నరేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అయ్యప్ప భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. నరేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ అయ్యప్ప మాలధారులు, హిందు సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. నరేష్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నరేష్‌పై తెలంగాణ రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్‌ల్లలో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న భైరి నరేష్ ను అరెస్ట్ చేశారు.
పరారీలో ఉన్న భైరీ నరేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేసి.. అతడి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ట్రేస్ చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ వెళ్తుండగా వరంగల్‌లో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో పోలీసులు భైరి నరేష్ ను కొడంగల్‌కు తరలించనున్నారు. భైరి నరేష్ అరెస్ట్ పై వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. విద్వేషాలు కలిగించేలా వ్యాఖ్యలు చేసిన నరేష్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అయ్యప్పస్వాములు ఆందోళనలు విరమించాలని ఎస్పీ కోరారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం కొడంగల్ లో జరిగిన ఓ సభలో భైరి నరేష్.. హిందు దేవుళ్లతో పాటు అయ్యప్ప స్వామిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడం తో వివాదంగా మారింది. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
అంతేకాక నరేష్ ని అరెస్టు చేయాలంటూ అయ్యప్ప భక్తులు, హిందువులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు. భైరి నరేష్ ను అరెస్టు చేయాలంటూ హిందువులు, అయ్యప్ప స్వాములు కొన్ని రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. అనేక ప్రాంతాల్లో నరేష్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేకాక పలు పోలీస్ స్టేషన్లలో భైరి నరేష్ పై ఫిర్యాదులు కూడా చేశారు. అతడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఆతడి యూట్యూబ్ ఛానల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతుండటంతో నరేష్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలోనే కరీంనగర్ వెళ్తుండగా.. వరంగల్ లో నరేష్ ను అరెస్ట్ చేశారు. మరీ.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.