ప్రస్తుతం ఈ ఆధునిక కాలంలో మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి. డబ్బు మీద ఉన్న ప్రేమ కన్న తల్లిదండ్రుల మీద ఉండటం లేదు. పేగు తెంచుకున్న బంధాన్నే నేడు కాదు పొమ్మంటున్నారు. అదేంటి అని అడిగితే నా ఉద్యోగం, నా జీవితం అంటూ సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఆన్సరే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎదురైంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఏ తల్లిదండ్రులైన తన కొడుకు ప్రయోజకుడు కావాలని కలలు కంటారు. అంతే కానీ తమను పట్టించుకోనంతగా ప్రయోజకుడు కావాలని అనుకోరు. అదీ కాక కనీ పెంచిన పాపానికి మాకో ముద్ద పెడితే చాలని అనుకుంటారు. వారికి కారు, బంగళాలలు అవసరం లేదు కళ్ల ముందు మీరుంటే చాలు అనుకుంటారు. కానీ అలాంటి తల్లిదండ్రులను నేడు తీసుకెళ్లి అనాథ, వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు. అందరూ ఉన్న అనాథలుగా వారు మారుతుంటే వారి గురించి విన్న వారికి సైతం కన్నీళ్లు ఆగడం లేదు. అయితే ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న బండి సంజయ్ కు అనుకోని సంఘటన ఎదురైంది.
బండి సంజయ్.. ప్రజా సంగ్రామ యాత్ర ప్రస్తుతం జనగామ జిల్లాలో కొనసాగుతోంది. అందులో భాగంగా ఓ పాఠశాలలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పాదయాత్రలో తనకు ఎదురైన ఓ సంఘటనను విద్యార్థులతో పంచుకున్నారు. ” తాజాగా నేను ఒక వృద్ధాశ్రామానికి వెళ్లాను. అక్కడో 70 ఏళ్ల ముసలవ్వను పలకరించగా తన బాధను చెప్పింది. తన కొడుక్కి బెంగళూరులో జాబ్ అని, నెలకు రూ. 5 లక్షల జీతం అని, అలాగే కోడలు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుందని తన మనవళ్లను హస్టళ్లలో వేశారని తెలిపింది.
దీంతో నాకే బాధ అనిపించి అతడికి ఫోన్ చేశా.. ”మీ అమ్మను వృద్ధాశ్రమంలో ఎందుకు వేశావని అడిగితే.. నా జీతం నెలకు రూ.5 లక్షలు సార్. నా జాబ్‌ను ఎలా వదులుకోవాలి అన్నాడు. నీ పిల్లలు ఏం చేస్తున్నారంటే.. హాస్టల్ లో వేశామని చెప్పాడు. నా భార్య ఒక దగ్గర.. నేను మరో దగ్గర.. దీంతో అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించాన ని చెప్పాడు. ఈ విషయం నీ పిల్లలకు తెలుసా? అంటే తెలుసని చెప్పాడు.
ఇదే విధంగా నిన్ను కూడా వారు రేపు పొద్దున వృద్ధాశ్రమంలో వేస్తారని చెప్పాను. ఇలాంటి చెడు ఆలోచనలని మీరు విడనాడి భవిష్యత్ తరాలకు మార్గదర్శకం కావాలని ఆయన సూచించారు. మరి దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్నా ఈ విధానానికి మీరు చరమగితం పాడాలి అని అన్నారు. మరి తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో చేర్పించే విష సంస్కృతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.