ప్రముఖ హేతువాది, మానవతావాది బాబు గోగినేని దిగ్గజ ప్రవచన కర్త గరికపాటి నరసింహరావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గరికపాటిపై ఒకరకంగా పరుష పదజాలం వాడారు. విగ్రహారాధన విషయంలో ఆయన చేసిన కామెంట్లపై బాబు గోగినేని స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గరికపాటివి ఫుల్ పాగల్ మాటలు, తుప్పాస్ మాటలు అని అన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే. గరికపాటి విగ్రహారాధనపై చేసిన ఓ ప్రసంగానికి సంబంధించిన ఓ వీడియో ఆయన అఫిషియల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా పోస్ట్ అయింది. ఆ వీడియోలో.. ‘‘ ఒకే శక్తి లలితా శక్తి. హిందువులేమీ పిచ్చివాళ్లు కాదు 33 కోట్ల మందిని ఆరాధించడానికి. ఒకే శక్తిని ఇన్ని రూపాల్లో ఆరాధిస్తున్నాం కానీ, మాకు తెలుసు అది ఒకే శక్తి అని.
వీరు వేరే వారు వేరే అని మేము అనుకోవడం లేదు ఇక్కడ. మళ్లీ ఒక రూపకల్పన చేసి.. ఆ రూపమే మాకు దేవుడు అంటారు.. మాకు విగ్రహారాధన లేదు అంటారు. ఈ రూపం ఎవరు విగ్రహం కాకపోతే. అన్ని మతాల వారు విగ్రహారాధన చేస్తున్నట్టే.. నాస్తికుల ఇళ్లలో కూడా ఫొటోలు ఉంటాయి. వాళ్లు కూడా విగ్రహారాధన చేస్తున్నట్టే కదా.. అడిగితే.. మాకు ఇన్స్పిరేషన్ అంటారు. ఇన్స్పిరేషన్ కోసం హిందువులు విగ్రహాలు పెట్టుకుంటే మనం మూర్ఖులం. నాస్తికులు, కమ్యూనిస్టులు, వారి లీడర్ల విగ్రహాలు పెట్టుకుంటే అది భక్తి. అదీ ఇన్స్పిరేషనే.. ఇదీ ఇన్స్పిరేషనే’’ అని అన్నారు.
View this post on Instagram
A post shared by Sri Garikipati Narasimha Rao (@garikipatinarasimharaoofficial)
ఇక, ఈ వీడియోపై బాబు గోగినేని గురువారం తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘‘ ఫుల్ పాగల్ మాటలు.. విగ్రహారాధనలో “ఆరాధన” ఉంది అవధాన్లూ – ఆ మాత్రం తెలియదూ? నాస్తికులు ఆరాధిస్తారా? ఫోటో ఉంటే ఆరాధనా? ఆడవాళ్ళ మీద లైంగిక దాడులకు వారినే బాధ్యులను చేయడం వంటి నేరపూరితమైన వ్యాఖ్యానాలను తక్షణం ఆపి వేయాలి. ఇట్లాంటి తుప్పాస్ మాటలు కూడా’’ అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం గరికపాటిపై బాబు గోగినేని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఫుల్ పాగల్ మాటలు
విగ్రహారాధన లో “ఆరాధన” ఉంది అవధాన్లూ – ఆ మాత్రం తెలియదూ? నాస్తికులు ఆరాధిస్తారా? ఫోటో ఉంటే ఆరాధనా?
ఆడవాళ్ళ మీద లైంగిక దాడులకు వారినే బాధ్యులను చేయడం వంటి నేరపూరితమైన వ్యాఖ్యానాలను తక్షణం ఆపి వేయాలి. ఇట్లాంటి తుప్పాస్ మాటలు కూడా.https://t.co/I31MLDSNOG
— Babu Gogineni (@GogineniBabu) November 3, 2022