మెడికో విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వరంగల్ కేఎంసీ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతోన్న ప్రీతి.. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తాజాగా ఈ వైద్య విద్యార్థిని కేసులో మరో కీలక ఆధారం లభ్యమైంది.
మెడికో విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వరంగల్ కేఎంసీ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతోన్న ప్రీతి.. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అయితే ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది.. మృతి చెందింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. కాలేజీ యాజమాన్య నిర్లక్ష్య ధోరణి కారణంగానే ప్రీతి మృతి చెందింది అనే ఆరోపణలు వచ్చాయి. తమ కుమార్తెది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికి హత్యేనని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపించారు. మెడికో విద్యార్థిని కేసులు పోలీసులు ఇప్పటికే పలు ఆధారాలు సేకరించారు. తాజాగా ఈ కేసులో మరో ఆధారం లభ్యమైంది.
ప్రీతి ఆత్మహత్య కేసులో ఇప్పటికే.. యాంటీ ర్యాగింగ్ కమిటీ, పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రీతి కేసులో మరో కీలక ఆధారం లభ్యమైంది. ఓ జూనియర్ మెడికల్ విద్యార్థి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. దీంతో.. ఈ వాంగ్మూలం కీలకంగా మారనుంది. యాంటీ ర్యాగింగ్ కమిటీ, పోలీస్ విచారణలో జూనియర్ మెడికో విద్యార్థి కీలక విషయాలను బయట పెట్టినట్టు తెలుస్తోంది. ప్రీ అనస్థీషియా రిపోర్ట్ వివాదంలో డాక్టర్ సైఫ్ చెప్పిన విషయాలకు భిన్నమైన విషయాలను జూనియర్ విద్యార్థి వెల్లడించినట్టు సమాచారం. పీఏసీ నివేదిక విషయంలో డాక్టర్ సైఫ్ ప్రత్యక్షంగా లేకున్నా డాక్టర్ ప్రీతిని బ్లేమ్ చేసినట్టు నిర్ధారించారు.
తన సీనియర్ డాక్టర్ సైఫ్ కావాలని తనను వేధిస్తున్నాడని, పీఏసీ రిపోర్ట్ గొడవను వివరించి తనకు మద్దతు ఇవ్వాలని డాక్టర్ ప్రీతి కోరిందంట. తనపై కుట్ర జరుగుతోందని మానసిక సంఘర్షణకు లోనైంది. ఇదే విషయంలో చివరి ఫోన్ కాల్ లో తన తోటి విద్యార్థులకు తెలియజేస్తూ బాధపడింది. ఈక్రమంలో మెడికల్ విద్యార్థిని ప్రీతి చివరి కాల్ డేటాపై పూర్తి స్థాయిలో సమాచారాన్ని దర్యాప్తు బృందం సేకరిస్తోంది. పీఏసీ నివేది విషయంలో నిందితుడు సైఫ్ వాదన అవాస్తవమని పోలీస్ విచారణ రుజువు చేస్తోంది.
జీఎంహెచ్లో జూనియర్ విద్యార్థినికి డిక్టేట్ చేస్తూ పీఏసీ నివేదికను వైద్యురాలు ప్రీతి ఫైండింగ్స్లో పొందుపరిచినట్లు కొత్త కోణం విచారణలో వెలుగు చూసింది. డాక్టర్ సైఫ్, వైద్యురాలు ప్రీతి మధ్య వివాదంగా మారిన ప్రశ్నించే తత్వం, దానికి సంబంధించిన మెసేజ్ కూడా లభ్యమైనట్టు సమాచారం. మొబైల్ డేటా, టెక్నికల్ఆధారాలు, శాస్త్రీయ ఆధారాలను బేస్ చేసుకుని పోలీసులు కేసులో ముందుకెళ్తున్నారు. మరి.. డాక్టర్ ప్రీతి కేసులో వచ్చిన తాజాగా సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.