మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రకాల ధరలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఓ డుబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించాలంటే తడిసి మోపడవుతుంది. డుబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించాలంటే దాదాపు రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతుంటుంది. దీంతో సామన్య ప్రజలకు ఇళ్లు కట్టుకోవాలనే ఆలోచనలే చేస్తే భయం పట్టుకుంది. అయితే ఇలాంటి తరుణంలోనే ఓ రైతుకి ఓ సూపర్బ్ ఐడియా తట్టింది. అన్ని లక్షలు పెట్టి ఇళ్లు కట్టుకునే బదులు ఓ రెడీమేడ్ ఇళ్లు నిర్మించుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనలు చేశాడు. ఇక ఇంకేముంది. ఆస్సలు ఆలస్యం చేయకుండా ఆ రైతు తన పొలంలో ఓ రెడీమేడ్ ఇళ్లును నిర్మించుకున్నాడు. ఇందులో బెడ్రూం, హాల్, కిచెన్, బాత్రూం వంటి గదులు కూడా ఉన్నాయి.
అసలు ఆ రైతు ఎవరు? తనకు వచ్చిన రెడీమేడ్ ఇళ్లను ఎలా నిర్మించాడు? ఎంత ఖర్చు అయిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. అది ఆదిలాబాద్ జిల్లా కన్నెపల్లి మండలం బజ్జరవెల్లి పంచాయితీ పరిధిలోని దాంపూర్. ఇదే గ్రామంలో లక్ష్మణ్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందిస్తున్నాడు. ఇతనికి 10 ఎకరాల సాగు భూమి ఉంది. 6 ఎకరాల్లో ఆయిల్ ఫాం చేస్తుండగా, మిగతా నాలుగు ఎకరాల్లో మాత్రం వరి పంటను పండిస్తున్నాడు. ఇక అతను వారాంతపు సెలవుల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి పొలానికి వస్తుంటాడు.
అక్కడికి వెళ్లాక వారికి ఉండడానికి ఎలాంటి గుడిసే కానీ, ఇళ్లు కాని లేవు. దీంతో పొలానికి వెళ్లాక అతని కుటుంబ సభ్యులు అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే రైతు లక్ష్మణ్ కు రెడీమేడ్ ఇళ్లును నిర్మించుకోవాలనే ఆలోచన వచ్చింది. వెంటనే ఆలస్యం చేయని లక్ష్మణ్.. హైదరాబాద్ నుంచి రెడీమేడ్ ఇళ్లును తయారు చేయించుకున్నాడు. ఈ ఇంట్లో ఓ హాల్ తో పాటు బెడ్రూం, కిచెన్, బాత్రూం రూమ్ లు ఉండడం విశేషం. ఇక ఈ రెడీమేడ్ ఇళ్లుకు గాను లక్ష్మణ్ దాదాపుగా రూ.4.80 లక్షల వరకు ఖర్చు అయినట్టుగా తెలిపాడు. అతి తక్కువ ధరకు నిర్మించుకున్న ఈ రెడీమేడ్ నిర్మాణం గురించి తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. భారీగా పెరిగిపోయిన ఖర్చులతో పోలిస్తే ఈ రెడీమేడ్ ఇళ్లు చాలా బెటర్ అంటూ చెబుతున్నారు.