తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌కు భారీ షాక్ తగిలింది. స్పీకర్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మరణించాడు. వాహనం అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ శివారులో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతుడు మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన నరసింహారెడ్డిగా గుర్తింపు. అతను ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన ఉద్యోగిగా తెలుస్తోంది. మనోహరాబాద్ శివారులో హడావుడిగా నడుచుకుంటూ వెళ్తున్న శ్రీనివాస్‌రెడ్డిని స్పీకర్ కాన్వాయ్‌లోని ఒక వాహనం ఢీకొట్టింది. ఇందులో అతివేగం కారణమా? లేక పాదచారుడు శ్రీనివాస్‌రెడ్డి ఏమైనా వాహనానికి అడ్డుగా వచ్చాడా ? అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.