గత కొన్ని రోజులుగా తెలంగాణలో కొనసాగుతున్న హై టెన్షన్ కి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముగింపు పలికారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ వీడుతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం ఉదయం స్పీకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజగోపాల్ రెడ్డి తన రాజీనామాను సమర్పించారు. అంతకు ముందు తన రాజీనామా లేఖను మీడియా సమక్షంలో అందరికి చూపించారు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేఖ ఇచ్చిన 10 నిమిషాల్లోనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజీనామాను ఆమోదించారు. పూర్తిగా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఉండటంతో వెంటనే పోచారం ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా అనంతరం రాజగోపాల్ రెడ్డి గవర్నర్ తమిళి సైను కలిసేందుకు అపాయిట్మెంట్ కోరారు. ఈ రోజు గవర్నర్ ను కలవనున్నారు. రాజీనామా చేసేముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు.
ఇక రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో తెలంగాణలో పార్టీలన్నీ మునుగోడులు పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈసారి గెలుపు దక్కించుకుంటేనే వచ్చే ఎన్నికల్లో సత్తా చాటగలమ్న ప్రయత్నంలో ఉన్నాయి. అయితే ఈ ఎన్నికలు ఆరునెలల్లో లేదా అంతకుముందే మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. దీంతో తెలంగాణ లో అన్ని పార్టీలు పోటీకి సిద్దమవుతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.