టాలీవుడ్ హీరో, మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రిలో సాయిధరమ్ తేజ్‌కు ప్రాథమికంగా చికిత్స చేశారు. సీటీ స్కాన్‌లో ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. తొలుత సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పవన్ కల్యాణ్, వైష్ణవ్ తేజ్ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో సాయి ధరమ్ తేజ్‌ని పరామర్శించారు. భయపడాల్సింది ఏమీ లేనట్లు పవన్ తెలిపారు.
పొట్ట, ఛాతీ, కుడి కన్ను పైభాగాల్లో తీవ్రంగా గాయాలు అయ్యాయి. పోలీసులు కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. బైక్ స్కిడ్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఇసుక ఉండటం వల్లే బైక్ స్కిడ్ అయినట్లు పోలీసులు కూడా తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న సాయిధరమ్ తేజ్‌ని గుర్తించి అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. ప్రమాద సమయంలో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తలకు పెద్దగా గాయాలు కాలేదని తెలిపారు. షాక్‌కు గురవ్వడం వల్లే అపస్మారక స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.