అమెరికాకు చెందిన వర్జిన్ గాలెక్టిక్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్‌సన్ స్పేస్ ఫ్లైట్ ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే. ఆయన విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లిరావడం చూసి అందరూ ఔరా అన్నారు. రిచర్డ్ బ్రాన్‌సన్ అంతటితో ఆగకుండా అంతరిక్షానికి కమర్షియల్ టూర్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఆ టూర్ బృందంలో మన భారత పర్యాటకుడు ‘సంతోష్ జార్జ్’ కుడా ఉన్నాడు.
కేరళకు చెందిన ‘సంతోష్ జార్జ్ కులంగర’ ఓ రోజు లండన్ నుంచి గ్లాస్గోకి ట్రైన్ వెళ్తున్నాడు. అతను కూర్చున్న సీటులో ఎవరో పేపర్ వదిలేసి వెళ్లారు. అంది చదువుతండగా సంతోష్ జార్జ్ వర్జిన్ గ్రూప్ గురించి తెలుసుకున్నాడు. వాళ్లు రోదసి యాత్ర ప్లాన్ చేస్తున్నట్లు తెలుసుకున్నాడు సంతోష్ జార్జ్. వెంటనే అతనూ ఓ టికెట్ కొనేశాడు. ఇది జరిగింది గత వారమో, గత సంవత్సరమో కాది. ఇదంతా 2007 జరిగిన సంగతి. ‘నేను అంతరిక్షానికి వెళ్తోంది అక్కడ ఎలా ఉందో చూడాలని కాదు, అంతరిక్షం నుంచి భూమి ఎలా ఉంటుందో తెలుసుకవాలని కాదు, నేను ఒక మీడియా పర్సన్‌ని. నేను సంచారం పేరుతో ట్రావెల్ షో చేస్తున్నాను. అందుకే అంతరిక్షంలోకి వెళ్లి ఆ ఎక్స్‌పీరియన్స్‌ని నా ఛానల్‌లో ప్రసారం చేయాలనుకున్నా’ అని సంతోష్ జార్జ్ తెలిపాడు. 1997 నుంచి సంతోష్ దాదాపు 130 దేశాలు పర్యటించాడు. ఇంకా, పర్యటిస్తూనే ఉన్నాడు.
యాత్రకి తన కెమెరాని తీసుకెళ్లేందుకు వర్జిన్ గాలెక్టిక్ టీమ్‌ని సంతోష్ ప్రత్యేకంగా అభ్యర్థించాడు. సంతోష్ కోసమే కాదు, మొత్తం భారతీయులకు ఈ యాత్ర ఎలా ఉండబోతోంది అన్న విషయం తెలుస్తుందని వారు అందుకు అంగీకరించారు. ‘నేను ఎక్స్‌ట్రా టికెట్ లేకుండానే నా కెమెరాని అంతరిక్షానికి తీసుకెళ్తున్నా’ అని తెలిపాడు. ఈ యాత్ర ఊరికే టికెట్ తీసుకుని వెళ్లొచ్చేది కాదు. ఇందుకు సరైన శిక్షణ అవసరం. ఇందుకు రెండు రకాల శిక్షణలు ఇస్తారు. ఒకటి జీరో గ్రావిటీ ట్రైనింగ్. రెండోది జి-టోలరెన్స్ ట్రైనింగ్. ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్లో ఈ రెండు శిక్షణ కార్యక్రమాలను సంతోష్ జార్జ్ విజయవంతంగా పూర్తి చేశాడు.
ఈ యాత్రకు సంతోష్ జార్జ్ 2.5 లక్షల డాలర్లు ఖర్చు పెడుతున్నాడు. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు కోటీ 82 లక్షల 27 వేలు అనమాట. వామ్మో అంతా? అని అవాక్కై పోకండి. అంతరిక్ష యాత్ర అనుభవం ముందు అది చిన్న మొత్తమే అని సంతోష్ జార్జ్ అంటున్నాడు.