ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఏదో ఒకరోజు భూమికి చేరాల్సిందే అంటే ఇదేనేమో. ఆకాశం వైపు చూసిన అతని చూపులు సఫలం కాలేదు కదా! భూమిపై నిలబడాలంటే ఆస్తులు అమ్ములుకోవాల్సిన దుస్థితికి తీసుకొచ్చింది.
అతనో బిలియనీర్.. రూ.కోట్లకు కోట్ల సంపద. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 400 కంపెనీలకు బాస్. అయితేనేం ఉన్నట్టుండి ఆర్థిక కష్టాల కడలిలో కూరుకుపోయాడు. ఈ ఆర్ధిక సమస్యల నుంచి బయటపడేందుకు నిధులు కావాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. ఒక్కసారిగా అతడు ఎందుకిలా తలకిందులయ్యాడో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఇది చదివేయండి. పేరు.. రిచర్డ్ చార్లెస్ నికోలస్ బ్రాన్సన్. వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు. 16 ఏళ్లకే స్కూల్ కి స్వస్తి పలికిన బ్రాన్సన్ 1966లోనే తన బిలియన్ సామ్రాజ్య స్థాపనకు తొలి అడుగు వేసాడు.
రోజులు గడుస్తున్న కొద్దీ ఒక్కో మెట్టు ఎదుగుతూ.. అతి కొద్ది కాలంలోనే యూకేలో ఉన్న అత్యంత ధనవంతుల్లో ఒకరిగా నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా 400 వ్యాపారాలతో నడిచే వర్జిన్ గ్రూప్ లిమిటెడ్ ను స్థాపించాడు. ఇలా కష్టాల కడలి నుంచి బిలియనీర్ గా మారడం వరకు గొప్పగా సాగిన అతని ప్రయాణం ఎందరికో స్ఫూర్తి. అలాంటి అపరకుబేరుడు ఒక్క దెబ్బకు దివాళా తీశాడు. ఈ ఏడాది ప్రారంభంలో రిచర్డ్ బ్రాన్సన్‌కు చెందిన శాటిలైట్ లాంచ్ సంస్థ ‘వర్జిన్ ఆర్బిట్’ తొమ్మిది ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రయోగానికి పూనుకుంది. ‘స్టార్ట్ అప్ మీ’ పేరుతో తొమ్మిది ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ‘లూనార్ వన్స్’ అనే మాడిఫైడ్ 747 జెట్‌ను ఉపయోగించింది. అనుకున్నట్లుగానే లూనార్ వన్స్.. నిప్పులు చిమ్ముతూ ఆకాశం వైపు దూసుకెళ్లింది. అయితే అనూహ్యంగా రాకెట్ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అది ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చలేకపోయింది. దీంతో ప్రయోగం విఫలమైనట్లు.. తొమ్మిది ఉపగ్రహాలు కక్ష్యను చేరుకోలేవని కంపెనీ ప్రకటించింది.
NEW: Richard Branson’s rocket company Virgin Orbit has filed for bankruptcy. pic.twitter.com/FI7UHB23XM
— Radar🚨 (@RadarHits) April 4, 2023
అంతే ఈ ప్రయోగం విఫలం కావడంతో రిచర్డ్ బ్రాన్సన్ ఆస్తులు మంచు కొండలా కరిగిపోయాయి. చూస్తుండగానే కంపెనీ షేర్లు దాదాపు 38 శాతం మేర పడిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. ఈ దెబ్బతో ఆర్థిక కష్టాల నుండి బయటపడటానికి 85 శాతం మంది ఉద్యోగుల్ని సైతం తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికీ ఆర్థికంగా మెరుగుపడకపోవటంతో ఆస్తులను విక్రయించాలని యుఎస్ దివాలా కోర్టులో కంపెనీ ఫైల్ దాఖలు చేసినట్లు రాయిటర్స్ కథనాన్ని నివేదించింది. ఈ విషయమై.. వర్జిన్ ఆర్బిట్ సీఈఓ డాన్ హార్ట్ మాట్లాడుతూ ఆస్తుల విక్రయాన్ని ఖరారు చేయడమే తమ ముందున్న ఉత్తమమైన మార్గమని చెప్పుకొచ్చారు.
Billionaire Richard Branson’s Virgin Orbit Files For Bankruptcy After Failed Satellite Launch https://t.co/mlyPOP4GxR pic.twitter.com/XB1sUX3ttY
— Forbes (@Forbes) April 4, 2023