లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి పడింది. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చాహల్ రికార్డు సాధించారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన ఘనతను చాహల్ సొంతం చేసుకున్నారు. నిన్న లక్నోలో భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజపాయ్ ఏకన క్రికెట్ స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండవ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్న్ అలెన్ వికెట్ ను తీయడంతో చాహల్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డుల్లోకెక్కారు. దీంతో టీ20 అంతర్జాతీయ ఫార్మాట్ లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లను తీసిన బౌలర్ గా రికార్డ్ సెట్ చేశారు.
న్యూజిలాండ్ తో జరిగిన రెండవ మ్యాచ్ కి టీమిండియా జట్టులో మార్పులు చేసింది. స్పిన్ విభాగానికి బలం చేకూరడం కోసం పేసర్ ఉమ్రాన్ మాలిక్ ను తప్పించి చాహల్ ను తీసుకున్నారు. దీంతో చాహల్ టీ20 ఫార్మాట్ లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సాధించారు. టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో 90 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ రికార్డును.. 91 వికెట్లతో చాహల్ బ్రేక్ చేశారు. నాల్గవ ఓవర్ లో బౌలింగ్ చేసిన చాహల్.. 3వ బంతితో ఫిన్న్ వికెట్ ను తీశారు. దీంతో టీ20 ఫార్మాట్ లో 87 మ్యాచుల్లో 90 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ ను రెండవ స్థానానికి నెట్టి.. మొదటి స్థానంలో నిలిచారు.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 3 మ్యాచుల టీ20 సిరీస్ రేసులో రెండవ మ్యాచ్ భారత్ కి తప్పక గెలవాల్సిన మ్యాచ్ అది. గెలుస్తుందా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది. 100 పరుగుల సునాయాస లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆఖరి ఓవర్ వరకూ కష్టపడాల్సి వచ్చింది. 19.5 ఓవర్లకి 4 వికెట్లు కోల్పోయి 101 టార్గెట్ ని చేధించారు. ఓపెనర్లు శుభ్ మన్ గిల్ (11), ఇషాన్ కిషన్ (19) త్వరగా ఔటయ్యారు. ఆ తర్వాత దిగిన రాహుల్ త్రిపాఠి (13), సూర్యకుమారి యాదవ్ (26 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (10 రనౌట్), హార్దిక్ పాండ్యా (15) చొప్పున పరుగులు చేశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ బ్యాటర్లను ఎక్కువ పరుగులు ఇవ్వకుండా భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్, చాహల్ తలో వికెట్ తీశారు. చాహల్ తీసిన ఈ ఒక్క వికెట్ తో.. అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. టీ20 ఫార్మాట్ లో 75 మ్యాచులు ఆడగా 91 వికెట్లు తీశారు. మరి చాహల్ ఈ రికార్డు సాధించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
First wicket of the match ✅
9⃣1⃣st wicket in T20Is ✅Watch how @yuzi_chahal dismissed Finn Allen & became #TeamIndia‘s leading wicket-taker in Men’s T20Is 🔽 #INDvNZ | @mastercardindia https://t.co/avftf9TvYB
— BCCI (@BCCI) January 29, 2023