టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్పిన్ మాయాజాలంతో పాటు చిలిపితనం కూడా మనోడికి చాలా ఎక్కువ. మ్యాచ్ జరుగుతుండగానే సహచరులను తన చిలిపిచేష్టలతో ఆటపట్టిస్తుంటాడు. ఇక సోషల్ మీడియాలో మనోడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన చిలిపి పనులు, డైలాగ్స్, వచ్చిరాని డాన్స్ తో అభిమానులను తికమక పెడుతుంటాడు. ఈ క్రమంలో చాహల్ సరదాగా చేతిలో సొరకాయ పట్టుకొని ఫోటో దిగాడు. ఆ ఫోటో చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, చాహల్ పై ఫన్నీ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2022 సీజన్ లో అత్యధిక వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ అందుకున్న చాహల్.. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ టీమిండియాలో మెరవనున్నాడు. జూన్ 9 నుంచి సౌతాఫ్రికా ప్రారంభం కానున్న టీ20 సిరీస్ లో కీలక బౌలర్ గా మారనున్నాడు. ఈ క్రమంలో చాహల్ తాజాగా ఓ ఫన్నీ పోస్ట్‌ను షేర్ చేశాడు. ‘సోరకాయతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన యజ్వేంద్ర చాహాల్.. ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం ఇలా ఫోజు ఇచ్చాడు’. ఆ ఫోటో చూసిన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫన్నీగా స్పందించాడు. ‘చూస్తుంటే నీ లోకీ (సోరకాయ) కూడా నీ సైజులోనే ఉన్నట్టుంది.’అంటూ నవ్వుతున్నట్టుగా యువీ ఎమోజీ జోడించాడు. ప్రస్తుతం ఈ సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది. వీరి సంభాషణ చూసిన నెటిజన్లు..’ చాహల్ పరువు యువరాజ్ బాజారుకీడ్చాడంటూ’ కామెంట్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Shoaib Akhtar: ఇంజమామ్ నా దగ్గరకు వచ్చి ‘సచిన్’ కు అలా వేయమని చెప్పేవాడు: షోయబ్ అక్తర్
చాహల్, యువరాజ్ ఫన్నీ సంభాషణ కొత్తేమికాదు. గతంలోనూ ఇలాంటి సరదా సంభాషణ జరిగింది. కాకుంటే.. అది కాస్త వివాదాలకు దారి తీసింది. ఇక.. ఐపీఎల్ 2022 సీజన్‌లో 27 వికెట్లు తీసిన చాహల్.. పర్పుల్ క్యాప్ అందుకోవడమే కాకుండా.. జాతీయజట్టులోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. మరి.. చాహల్ సొరకాయ పోస్టుపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Yuzvendra Chahal Sir Shows his masterclass in IPL 2022 Season. Congratulations @yuzi_chahal Sir For Purple Cap 🧢 💜. Delightful to watch his Fabulous Bowling Spells.
17 Matches
27 Wickets
19.52 Average
7.75 Economy Rate
1 Hat trick
2 MOM Awards
5/40 BBF pic.twitter.com/TfIJDfgADh— DailyNews (@news_daily0) June 1, 2022