టీమిండియా రన్ మెషిన్ గా విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సాధిస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా క్రికెట్ చరిత్రలో ఏ ప్లేయర్ సాధించలేని ఘనతను సాధించాడు. ఈ రికార్డులో కోహ్లీని మించినోడు లేడు అని మరోసారి నిరూపించుకున్నాడు. ఆ ఘనత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు నమోదు అవుతూ ఉంటాయి. అయితే కొన్ని రికార్డులు మాత్రం కొందరి కోసమే రాసిపెట్టి ఉంటాయి. అలా క్రికెట్ వరల్డ్ లో రికార్డుల రారాజుగా దుసుకెళ్తున్నాడు టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ. ఇక విరాట్ సెంచరీ కొడితే.. ఏదో ఒక రికార్డు బద్దలవుతూనే ఉంటుంది. తాజాగా ఆసిస్ తో జరిగిన నాలుగో టెస్ట్ లో భారీ శతకం నమోదు చేశాడు విరాట్. ఈ క్రమంలోనే క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు సృ ష్టించని రికార్డును నెలకొల్పాడు. ఆ రికార్డు ఏంటంటే?
విరాట్ కోహ్లీ.. రన్ మెషిన్, రికార్డుల రారాజు, ఫిట్ నెస్ కా బాప్, GOAT క్రికెట్ చరిత్రలో ఇన్ని పేర్లు ఏ ఆటగాడికి ఉండవు అనుకుంటా. ఇక గత కొంత కాలంగా టెస్టుల్లో విఫలం అవుతూ వస్తున్న విరాట్.. ఆసిస్ తో జరిగిన నాలుగో టెస్ట్ లో భారీ శతకం సాధించడం ద్వారా ఫామ్ లోకి వచ్చాడు. ఈ క్రమంలోనే 75వ శతకం బాది, టెస్టుల్లో తన శతక దాహాన్ని తీర్చుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో 364 బంతులు ఎదుర్కొన్న విరాట్ 15 ఫోర్లతో 186 పరుగులు చేసి కొద్దిలో డబుల్ సెంచరీ చేసే వకాశాన్ని చేజార్చుకున్నాడు. కోహ్లీ భారీ శతకం కారణంగానే భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. దాంతో ఈ టెస్ట్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైయ్యాడు విరాట్.
ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు కింగ్ కోహ్లీ. వివరాల్లోకి వెళితే.. క్రికెట్ చరిత్రలో మూడు ఫార్మాట్లలో అంటే టెస్ట్ లు, వన్డేలు, టీ20ల్లో 10కి పైగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకున్న తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఇక టెస్ట్ ల్లో కోహ్లీ ఈ మ్యాచ్ లో అందుకున్న ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తో కలిపి 10 అవార్డులు అందుకున్నాడు. వన్డేల్లో 38 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు, టీ20ల్లో 15 అవార్డులను అందుకుని మూడు ఫార్మాట్లలో 10 అవార్డులు అందుకున్న తొలి ప్లేయర్ గా క్రికెట్ చరిత్రలో నిలిచాడు. మరి క్రికెట్ చరిత్రలో ఏ ప్లేయర్ సాధించని ఘనత సాధించిన విరాట్ కోహ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Virat Kohli in international cricket:
10 MOM awards in Tests.
38 MOM awards in ODIs.
15 MOM awards in T20Is.Virat Kohli becomes first player to have 10+ MOM awards in all three formats in the history – The GOAT. pic.twitter.com/NrgfVnNOZe
— CricketMAN2 (@ImTanujSingh) March 13, 2023