SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Vinod Kambli Life Story In Telugu

Vinod Kambli: ఒకప్పుడు సచిన్‌ని మించిన ఆటగాడు! ఇప్పుడు దీనస్థితిలో! వినోద్ కాంబ్లీ అసలు కథ!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 18 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Vinod Kambli: ఒకప్పుడు సచిన్‌ని మించిన ఆటగాడు! ఇప్పుడు దీనస్థితిలో! వినోద్ కాంబ్లీ అసలు కథ!

ఈ కుర్రాడు వినోద్‌ కాంబ్లీకి స్కూల్‌ ఫ్రెండ్‌ అంటూ ఒకప్పుడు సచిన్‌ పరిచయానికి కాంబ్లీ పేరు ఉపయోగపడేది. అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఒక ఉద్యోగం కావాలంటూ రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రాధేయపడటం చర్చనీయాంశంగా మారింది. గత మూడునాలుగు రోజులుగా సచిన్‌ బాల్య స్నేహితుడు వినోద్‌ కాంబ్లీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడంటూ వార్తాలు వస్తున్న విషయం తెలిసిందే. కెరీర్‌ ఆరంభంలో సచిన్‌తో పోటాపోటీగా పేరుతెచ్చుకుని.. ఒక దశలో సచిన్‌ను మరిపించిన కాంబ్లీకి అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది. అసలు అతని గతం ఏంటి? సచిన్‌ సక్సెస్‌ అయినట్లు అతనెందుకు కాలేకపోయాడు? వీటి గురించి క్షుణ్ణంగా ఇప్పుడు తెలుసుకుందాం..

ముంబైలో పుట్టిపెరిగిన వినోద్‌ కాంబ్లీ.. బాల్యం పేదరికంలోనే గడిచింది. ఒక పూట తిండికి కూడా ఇబ్బంది పడే కుటుంబ నేపథ్యం కాంబ్లీది. కానీ క్రికెట్‌లో మాత్రం కాంబ్లీ చురుగ్గా ఉండేవాడు. స్కూల్‌ క్రికెట్‌లో కాంబ్లీ ఒక సూపర్‌స్టార్‌. ఈ క్రమంలోనే సచిన్‌ టెండ్కూలర్‌తో కలిసి స్కూల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఏకంగా 664 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌తో కాంబ్లీ-సచిన్‌ల పేర్లు క్రికెట్‌ ప్రపంచలో మారుమోగిపోయాయి. ఇక్కడి నుంచి కాంబ్లీ-సచిన్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయిపోయాడు. ఇద్దరూ క్రికెటే ప్రాణంగా ముందుకు సాగారు. ఈ క్రమంలోనే 1991లో కాంబ్లీ భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.

vinod-kambli-life-story-in-telugu

1991 అక్టోబర్‌ 18న పాకిస్థాన్‌తో షార్జాలో జరిగిన వన్డే మ్యాచ్‌తో కాంబ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇక్కడి నుంచి కాంబ్లీ శకం ప్రారంభమైనట్లు అనిపించింది. 1993లో భారత్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌తో టెస్టులోకి అడుగుపెట్టిన కాంబ్లీ.. ఆడిన తొలి ఏడు టెస్టుల్లోనే ఏకంగా 793 పరుగులు చేసి సత్తా చాటాడు. 1993లో అతడి బ్యాటింగ్ యావరేజ్ 113 ప్లస్‌. ఈ బ్యాటింగ్‌ యావరేజ్‌ అప్పట్లో సంచలనం. సచిన్‌ అయితే ఈ బ్యాటింగ్‌ యావరేజ్‌కు ఆ సమయంలో దరిదాపుల్లో కూడా లేడు. ఇక అదే ఏడాది రెండు డబుల్‌ సెంచరీ(223, 227)లతో అదరగొట్టాడు. దీంతో వినోద్‌ కాంబ్లీ ప్రపంచ క్రికెట్‌లో ఒక స్టార్‌గా మారిపోయాడు. కెరీర్‌ను ఇలా రాకెట్‌ స్పీడ్‌తో ప్రారంభించిన ఏకైక క్రికెటర్‌ కాంబ్లీనే.

అలాగే అతిపిన్న వయసు(21 ఏళ్ల 32 రోజులు)లో డబుల్‌ సెంచరీ కొట్టిన మూడో ఆటగాడిగా కాంబ్లీ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న 4వ ఆటగాడిగా కాంబ్లీ నిలిచాడు. అలాగే వినోద్‌ కాంబ్లీ తన తొలి 58 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా డకౌట్‌ కాలేదు. ఇలా కెరీర్‌ ఆరంభంలోనే సంచలనాలు సృష్టిస్తూ.. ఇండియన్‌ క్రికెట్‌లో వినోద్‌ కాంబ్లీ ఒక సూపర్‌ స్టార్‌గా ఎదిగాడు. అదే సమయంలో సచిన్‌ కూడా కాంబ్లీతో పాటే ఎదుగుతు వచ్చాడు. కానీ.. ఒక్కసారిగా వచ్చి పడిన స్టార్‌డమ్‌తో కాంబ్లీ ఫోకస్‌ పక్కదారి పట్టంది.

vinod-kambli-life-story-in-telugu

ఆటపై శ్రద్ధ తగ్గించి జల్సాలకు ఎక్కువగా అలవాటు అయ్యాడు. ఇదే టైమ్‌లో సచిన్‌ మాత్రం ఆటపై నుంచి తన దృష్టి మరలకుండా జాగ్రత్త పడ్డాడు. ఎంతో కమిట్‌మెంట్‌తో కెరీర్‌పై ఫోకస్‌ చేశాడు. స్కూల్‌ దశ నుంచి సచిన్‌తో సమానంగా ఎదుగుతూ వచ్చిన కాంబ్లీ.. ఒక దశ తర్వాత సచిన్‌ కంటే వెనుకబడ్డాడు. సచిన్‌ మాత్రం క్రికెటే ప్రపంచంగా ముందుగా సాగాడు. ప్రపంచ క్రికెట్‌లో సచిన్‌ దిగ్గజంగా మారడానికి.. కాంబ్లీ ఒక మెరుపుతీగలా మెరిసి మాయమైపోయేందుకు తేడా కేవలం కమిట్‌మెంట్‌. సచిన్‌ క్రికెట్‌ పట్ల ఎంతో అంకితభావంతో ఉంటూ దూసుకెళ్తుంటే.. వినోద్‌ కాంబ్లీ మాత్రం తన స్టార్‌డమ్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఆటను నిర్లక్ష్యం చేశాడు. పైగా తాగుడుకు బానిసైయ్యాడు.

వివాదాలో సహవాసం..
ఆట పరంగా దారుణంగా విఫలం అయిన కాంబ్లీ వివాదాలతోనూ సహవాసం చేశాడు. 1996 ప్రపంచ కప్‌లో భారత్‌-శ్రీలంక మ్యాచ్‌లో ఫిక్సింగ్‌ జరిగిందంటూ సంచలన ప్రకటన చేయడం, తన బాల్య స్నేహితుడు సచిన్‌ టెండూల్కర్‌ తనకు ఎలాంటి సహాయం చేయడం లేదని ప్రకటించి వివాదాల్లో చిక్కుకున్నాడు. అలాగే ఒక సారి ఫుల్‌గా మద్యం సేవించి కారు నడిపి.. యాక్సిండెట్‌ చేసి అరెస్ట్‌ కూడా అయ్యాడు.

vinod-kambli-life-story-in-telugu

అంతర్జాతీయ క్రికెట్‌లోకి జెడ్‌స్పీడ్‌తో దూసుకొచ్చి కాంబ్లీ.. కెరీర్‌ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. 1993లో టెస్టు కెరీర్‌ మొదలుపెట్టిన కాంబ్లీ 1995లోనే టెస్టులకు దూరమయ్యాడు. 17 టెస్టులు ఆడి 1084 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక 104 వన్డేలు ఆడిన కాంబ్లీ 2477 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సచిన్‌ లాంటి కమిట్‌మెంట్‌తో ఆడి ఉంటే కాంబ్లీ కూడా ఇప్పుడు ఇండియన్‌ క్రికెట్‌లో ఒక లెజెండ్‌లా ఉండేవాడు. కానీ.. అతను చేజేతులా చేసుకున్న పనులు, చెడు వ్యసనాలు, దురదృష్టం కాంబ్లీ కెరీర్‌ను నాశనం చేశాయి. ఇప్పుడు తన కుటుంబం గడిచేందుకు ఒక ఉద్యోగం ఇప్పించాలని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ను ప్రాధేయ పడాల్సిన దుస్థితి వచ్చింది.

కెరీర్‌ను ఎంచుకోవడం, అద్భుతమై ఆరంభం అందుకోవడంతో పాటు కమిట్‌మెంట్‌తో పనిచేయడం కూడా ఎంతో ముఖ్యమని చెప్పేందుకు సచిన్‌-కాంబ్లీ జీవితాలు ఒక ఉదాహరణగా నిలుస్తాయి. ఇద్దరూ స్టార్లుగా మారిన తర్వాత.. ఒకరు అదే అకింతభావంతో దిగ్గజంగా ఎదిగితే.. మరొకరు స్వయంకృత అపరాధాలతో దయనీయ స్థితికి చేరుకున్నారు. మరి వినోద్‌ కాంబ్లీ కెరీర్‌, ప్రస్తుత పరిస్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Sachin🐐 & Vinod kambli… Both gifted with immense Talent , one was Disciplined , other was not

Two great examples for life… two different career paths..! pic.twitter.com/I5AvmFdfxQ

— Cricpedia (@_Cricpedia) August 17, 2022

A story on Vinod Kambli in today’s @mid_day by @Haritjoshi and myself…https://t.co/fnJlIzne27

— Clayton J Murzello (@ClaytonMurzello) August 17, 2022

‘Sachin knows everything, but I am not expecting anything from him’: Struggling Vinod Kambli desperately looking for workhttps://t.co/r08lrHQvhD pic.twitter.com/n2fzE1UTiZ

— Sports Tak (@sports_tak) August 17, 2022

ఇది కూడా చదవండి: ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన గంగూలీ ఈ ఆటగాడిని తొక్కేశాడా?

Tags :

  • Cricket News
  • sachin tendulkar
  • Vinod Kambli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam