క్రికెట్ అంటే ఫుల్ టెన్షన్. మ్యాచ్ లో ఎవరు గెలుస్తారా అని ఇరుజట్ల ఆటగాళ్లతో పాటు స్టేడియంలో కూర్చున్న అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తుంటారు. అయితే కొన్నిసార్లు మ్యాచ్ జరుగుతున్న టైంలోనే ఫన్నీ సీన్స్ కూడా జరుగుతుంటాయి. ఏకంగా లవ్ ప్రపోజల్స్ కూడా కనిపిస్తుంటాయి. ఇది ప్రతిసారి జరుగుతుందని చెప్పలేం. తాజాగా టీ20 ప్రపంచకప్ లో భారత్-నెదర్లాండ్ మ్యాచ్ సందర్భంగా ఇలాంటి ప్రపోజల్ సీన్ కూడా ఒకటి కనిపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కేఎల్ రాహుల్ మరోసారి విఫలమైనప్పటికీ.. కెప్టెన్ రోహిత్ శర్మ 53, కోహ్లీ 62, సూర్య కుమార్ 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగుల స్కోరు నమోదైంది. ఆ తర్వాత నెదర్లాండ్స్ బ్యాటింగ్ లో పూర్తిగా విఫలమైంది. భారత్ బౌలర్ల తాకిడికి తట్టుకోలేక చేతులెత్తేసింది. దీంతో వరల్డ్ కప్ లో రోహిత్ సేన మరో విజయాన్ని అందుకుంది.
ఇదంతా పక్కనబెడితే.. నెదర్లాండ్స్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో మన దేశానికి చెందిన ఓ కుర్రాడు.. తన ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి కూడా ఓకే చెప్పేసింది. దీంతో అబ్బాయి రింగ్ తొడిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలోనూ ఇలాంటి లవ్ ప్రపోజల్ సీన్స్ చాలా కనిపించాయి. దీంతో సోషల్ మీడియాలో జోకులు కూడా పేలుతున్నాయి. ‘బయట ప్రపోజ్ చేస్తే ఎవరైనా కాదంటారేమో… స్టేడియంలో ప్రపోజ్ చేస్తే అస్సలు కాదనరు.. మీరు ట్రై చేయండి’ అని పలువురు నెటిజన్స్.. మిగతా వాళ్లకు సలహాలు కూడా ఇస్తున్నారు.
During match….Proposal from Indian boy…….Love for Cricket..Love for Partner pic.twitter.com/0wZ5oBV3y7
— Ashutosh Yadav (@Ashutosh8429) October 27, 2022