టీమిండియా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా బ్యాటింగ్ చేయడానికి తెగ ఇబ్బందిపడుతున్న కోహ్లీ… ఫామ్ లోకి వచ్చేశాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో పాత కోహ్లీని గుర్తుచేశాడు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరోవైవు నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ కూడా హాఫ్ సెంచరీలు చేసి ట్రాక్ లోకి వచ్చేశారు. కానీ ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం రెండు మ్యాచ్ ల్లోనూ నిరాశపరిచాడు. ఇప్పుడు కూడా అలాంటిదే ఓ విషయం జరిగింది. సోషల్ మీడియాలో అది కాస్త వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పాక్ తో మ్యాచ్ లో ఫెయిల్ అయిన కేఎల్ రాహుల్, నెదర్లాండ్స్ తో మ్యాచ్ కైనా సరే ట్రాక్ లోకి వస్తాడని ఫ్యాన్స్ భావించారు. కానీ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్ 3 ఓవర్ వాన్ మీకెరెన్ బౌలింగ్, కేఎల్ రాహుల్ షాట్ ఆడదామని చూశాడు. అది కాస్త ప్యాడ్ ని తాకింది. అంపైర్ ఔట్ గా ప్రకటించారు. అయితే ఈ ఎల్బీడబ్ల్యూ విషయంలో రివ్యూ తీసుకోవాలా వ్దా అన్న సందేహంలో రాహుల్ ఉన్నాడు. ఈలోపు నాన్ స్ట్రైక్ ఎండ్ లోని రోహిత్ శర్మ.. మాట్లాడదామని రాహుల్ వైపు నడిచాడు. అది వివరిస్తాం అనేంతలో రాహుల్ పెవిలియన్ వైపు వెళ్లిపోయాడు.
ఇకపోతే ఆ బంతి వికెట్లని తాకలేదని రిప్లేలో తేలింది. దీంతో కేఎల్ అవసరంగా ఔటయ్యాడని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎంచుకున్నాడు. కేఎల్ రాహుల్ నిరాశపరిచినా సరే రోహిత్ శర్మ 53, కోహ్లీ 62, సూర్య కుమార్ యాదవ్ 51 పరుగులు చేసి వావ్ అనిపించారు. కోహ్లీ ఎప్పటిలానే క్లాస్ ఇన్నింగ్స్ ఆడగా.. సూర్య, రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం భారత క్రికెట్ ప్రేమికుల్ని ఆనందపరిచింది. ఇక మొత్తంగా 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా 179 పరుగులు చేసింది.
It was missing the wickets. pic.twitter.com/OEwPBEJDTo
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 27, 2022