టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా ఐర్లాండ్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 185 పరుగుల భారీ స్కోరు ను సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం జోషువా లిటిల్ అనే చెప్పాలి. జోరుమీదున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తోపాటు మరో ఇద్దరు ఆటగాళ్లను వరుసగా అవుట్ చేశాడు లిటిల్. దాంతో ప్రపంచ కప్ లో రెండవ హ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు జోషువా లిటిల్. దాంతో ఇతడి బౌలింగ్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వసీం అక్రమ్, జహీర్ ఖాన్ ల యాక్షన్, భువనేశ్వర్ కుమార్ ను మించిన స్వింగ్ లిటిల్ సొంతం. దాంతో ఐర్లాండ్ కు మరో జహీర్ ఖాన్, భువీలు ఇద్దరు కలగలసిన వజ్రం లాంటి ఆటగాడు దొరికాడని మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే పసికూన జట్టులో ఉన్నందు వల్ల రావాల్సినంత పేరు జోష్ లిటిల్ కు రాలేదు.
Hat-tricks in Men’s T20 World Cup history:
Brett Lee
Curtis Campher
Kagiso Rabada
Wanindu Hasaranga
Karthik Meiyappan
Josh Little#CricTracker #JoshLittle #NZvIRE #T20WorldCup pic.twitter.com/qYUO1HdfO0— CricTracker (@Cricketracker) November 4, 2022
జోషువా లిటిల్.. 22 సంవత్సరాల ఈ ఐర్లాండ్ యువకెరటం క్రికెట్ లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. తన పదునైన పేస్ తో, స్వింగ్ తో ప్రత్యర్ధి బ్యాట్స్ మెన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. ఇతడి బౌలింగ్ ను ఓ సారి పరిశీలిస్తే.. బాల్ బ్యాట్ కు సరిగ్గా కనెక్ట్ అవుతున్నట్లే కనిపిస్తుంది. కానీ తీరా బ్యాట్ దగ్గరికి వచ్చే సరికి స్వింగ్ అయ్యి.. వికెట్లను గిరాటేసే దాక తెలియదు బ్యాటర్ కు. అంత గొప్ప ఇన్ అండ్ అవుట్ స్వింగ్ రాబట్టగల సమర్థుడు జోషువా లిటిల్. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 3 ఓవర్లు వేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఆ రెండు వికెట్లు కూడా ఇంగ్లాండ్ ఓపెనర్లవే కావడం విశేషం. అద్భుతమైన బంతులతో జోష్ బట్లర్ ను, అలెక్స్ హేల్స్ ను ఆరంభంలోనే బోల్తా కొట్టించాడు. దాంతో జట్టు పరుగుల వేగం తగ్గింది. ఇది ఐర్లాండ్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. జోష్ లిటిల్ బౌలింగ్ యాక్షన్ అచ్చం టీమిండియా వెంటరన్ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ లా ఉంటుందని మాజీలు కితాబిస్తున్నారు.
Joshua Little – A star in making!#JoshuaLittle #BhuvneshwarKumar #JasonHolder #ENGvIRE #ENGvsIRE #IREvENG #IREvsENG #Ireland #England #T20I #T20Is #T20WorldCup #T20WorldCup2022 #T20WC #T20WC2022 #Cricket #Sportsbettingmarkets pic.twitter.com/A42OIlMO6J
— Sportsbettingmarkets.com (@Sbettingmarkets) October 26, 2022
ఇక అతడి స్వింగ్ ముందు భువనేశ్వర్ కుమార్ స్వింగ్ కూడా దిగదుడుపే అని కొందరి క్రీడానిపుణుల వాదన. వీరందరి వాదనలను నిజం చేస్తూ.. లిటిల్ 2022లో ఫాస్ట్ బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే 34 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో భువనేశ్వర్ సైతం లిటిల్ వెనకాలే ఉండటం గమనార్హం. జోషువా లిటిల్సత్తా ముందే కనిపెట్టిన ధోని.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తీసుకున్నాడు. నెట్ బౌలర్ గా లిటిల్ చెన్నైకి తన సేవలను అందిస్తున్నాడు. ఈ ప్రదర్శనతో త్వరలోనే అతడు చెన్నై జట్టులోకి రావడం పక్కా అని మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అండర్ డాగ్ గా బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు బౌలింగ్ దళానికి జోష్ లిటిలే నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి అతడి వయస్సు 22 సంవత్సారాలే కావడంతో.. భవిష్యత్తులో అతడు అగ్రశ్రేణి బౌలర్ గా ఎదుగుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
Joshua Little is on fire.#JoshuaLittle #England #Ireland #T20 #Circket #ENGvsIRE #SKY247 #WorldCup #Socialmedia pic.twitter.com/uOVHjwNtMd
— Sky247 (@officialsky247) October 26, 2022
Josh Little – The future of Ireland 🔥🔥🔥#CricTracker #JoshLittle #T20WorldCup2022 pic.twitter.com/yWq1Ic9w9X
— CricTracker (@Cricketracker) October 26, 2022