గత కొంత కాలంగా టీ20 వరల్డ్ క్రికెట్ లో మారుమ్రోగిన పేరు సూర్య కుమార్ యాదవ్. అతడి ఆటతీరుపై ప్రశంసలు కురిపించని మాజీలు లేరంటే అతిశయోక్తికాదు. అంతలా అతడి పేరు క్రికెట్ అభిమానుల్లో నానింది. విదేశీ క్రికెటర్లతో పాటుగా టీమిండియా ఆటగాళ్లు సైతం SKY పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం సూర్య రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ నుంచి ముంబై జట్టుకు అందుబాటులోకి రానున్నాడు. ఈ క్రమంలోనే ప్రముఖ మీడియా సంస్థ అయిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా కోహ్లీతో బ్యాటింగ్ చేసే క్రమంలో.. కోహ్లీ అడిగిన ప్రశ్నలను అభిమానులతో పంచుకున్నాడు.
విరాట్ కోహ్లీ.. టీమిండియా రన్ మెషిన్ గా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మరి ఇంతటి క్రేజ్ తెచ్చుకున్న వాడు పొగిడితే ఎలా ఉంటుంది? ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ప్రస్తుతం ఇలాంటి సంతోషాన్నే మనతో పంచుకున్నాడు టీమిండియా మిస్టర్ 360 గా పేరుగాంచిన సూర్య కుమార్ యాదవ్. ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో సూర్య మాట్లాడుతూ..”నేను విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేసేప్పుడు.. నా బ్యాటింగ్ విన్యాసాలు చూసి, నా దగ్గరికి వచ్చి.. సూర్య నువ్వు వీడియో గేమ్ ఆడుతున్నావా? నువ్వు అరుదైన బ్యాట్స్ మెన్ వి” అంటూ విరాట్ నాతో చెప్పాడు.
ఇక ఈ మాటలు వినడానికి చాలా సంతోషంగా ఉన్నాయని సూర్య తెలిపాడు. ఒక ఆటగాడికి ప్రశంలు వింటే ఎనర్జీ పెరుగుతుంది.. పైగా కోహ్లీ లాంటి దిగ్గజాల నోటి వెంట వింటే ఉత్సాహాం ఉరకలేస్తుంది అని సూర్య కుమార్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సూర్య రంజీల్లో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రంజీల్లో ముంబై తరపున బరిలోకి దిగనున్నాడు ఈ డేంజరస్ బ్యాటర్. హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో సూర్య బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. మరి టీ20ల్లో అదరగొట్టిన సూర్య టెస్టుల్లో ఏ విధంగా రాణిస్తాడో అని అభిమానులు వేచిచూస్తున్నారు.
Suryakumar Yadav (in The Indian Express) said “When I was batting with Virat bhai, he came & told me that ‘Are you playing video game, you are in different level’ – it felt nice to hear from him”.
— Johns. (@CricCrazyJohns) December 19, 2022