యాషెస్ లో భాగంగా తొలి రెండు టెస్టులు ఓడిపోయిన ఇంగ్లాండ్ మూడో టెస్టులో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మాంచెస్టర్ వేదికగా రేపు నాలుగో టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఇక ఈ మ్యాచ్ కి ముందు ఇంగ్లాండ్ పేసర్ బ్రాడ్ వోక్స్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
యాషెస్ లో ఇంగ్లాండ్ జట్టు సిరీస్ ఆశలను నిలుపుకుంది. మొదటి రెండు టెస్టుల్లో పరాజయం పాలైనా చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచులో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మరో రెండు టెస్టు మ్యాచులు మిగిలి ఉండడంతో సిరీస్ ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇరు జట్ల మధ్య రేపు మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగబోతుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇంగ్లాండ్ కీలక పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. తన భార్య తనకన్నా క్రిస్ వోక్స్ అంటేనే ఎక్కువగా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. మరి దీనికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం.
తొలి రెండు టెస్టులు ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టు కీలకమైన మూడో టెస్టులో మార్క్ వుడ్, క్రిష్ వోక్స్ లను తుది జట్టులోకి తీసుకొచ్చింది. వీరిద్దరే ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా వోక్స్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టేసాడు. ఛేజింగ్ లో కీలక సమయంలో బ్యాటర్లు ఔటైనా చివరి వరకు క్రీజ్ లో ఉంది ఇంగ్లాండ్ కి విజయాన్ని అందించాడు. దీంతో ఇప్పుడు వోక్స్ మీద ప్రశంసల వర్షం కురుస్తుండగా స్టువర్ట్ బ్రాడ్ తన భార్యకు వోక్స్ అంటే పిచ్చి అని తెలిపాడు. ఈ సందర్భంగా బ్రాడ్ మాట్లాడుతూ..బ్రాడ్ వోక్స్ టాలెంట్ గురించి అదే విధంగా తన భార్యకు వోక్స్ అంటే ఎంత ఇష్టమో తెలిపాడు.
“వోక్స్ ఒక అసాధారణ ఆటగాడు. నా భార్య మోలీ ఎప్పుడూ కూడా తన ఫేవరేట్ క్రికెటర్ అని చెబుతుంటుంది. దీనికి వెంటనే నేను కాదా? అని అడిగాను. దానికి నా భార్య నువ్వు కాదు క్రిస్ వోక్స్ ఫస్ట్. ఆ తర్వాతే నువ్వు అని బదులిచ్చింది. ఇది వోక్స్ దక్కిన అతి పెద్ద న అతిపెద్ద ప్రశంస అని నేను భావిస్తున్నా. ఇంగ్లండ్ 2 వన్డే, టీ 20 ప్రపంచకప్ లు గెలవడంతో వోక్స్ కీలకపాత్ర పోషించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా హెడింగ్లీ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.”అని బ్రాడ్ తెలియజేశాడు. ఇక రేపు జరగబోయే టెస్టు కోసం ఇంగ్లాండ్ ఇప్పటికే తుది జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబిన్సన్ ప్లేస్ లో వెటరన్ పేసర్ ఆండర్సన్ జట్టులో చేరనున్నాడు. మొత్తానికి బ్రాడ్.. తన భార్యకు తనకన్నా వోక్స్ అంటేనే ఇష్టం అని చెప్పడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.