'సౌరవ్ గంగూలీ' ఈ పేరు తెలియని క్రికెట్ అభిమానులెవ్వరూ ఉండకపోవచ్చు. చప్పగా సాగుతోన్న భారత్ క్రికెట్ ప్రయాణాన్ని ప్రపంచానికి సగర్వంగా తెలియజేసిన ధీరుడు దాదా. 1983 ప్రపంచ కప్‌ను భారత్ దక్కించున్నప్పటికీ, అప్పటి అగ్రశ్రేణి జట్లయిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ వంటి జట్లు టీమిండియాను చిన్న జట్టుగానే చూసేవి. కానీ, 2000 సంవత్సరంలో దాదా భారత జట్టు పగ్గాలు చేపట్టాక రూపురేఖలు మారిపోయాయి. జట్టులోకి యువ ఆటగాళ్లకు ప్రవేశం లభించింది. యువ రక్తంతో నిండిన కొత్త జట్టు అప్పటి అగ్ర జట్లకు సవాల్ విసిరేది. ఇలా చెప్పుకోవాలంటే.. దాదా హయాంలోని రోజులు, జ్ఞాపకాలు మరుపురానివి.
టీమిండియా మాజీ సారథి ‘సౌరవ్ గంగూలీ’ పేరు తెలియని క్రికెట్ అభిమానులెవ్వరూ ఉండకపోవచ్చు. చప్పగా సాగుతోన్న భారత్ క్రికెట్ ప్రయాణాన్ని ప్రపంచానికి సగర్వంగా తెలియజేసిన ధీరుడు దాదా. 1983 ప్రపంచ కప్‌ను భారత్ దక్కించున్నప్పటికీ, అప్పటి అగ్రశ్రేణి జట్లయిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ వంటి జట్లు టీమిండియాను చిన్న జట్టుగానే చూసేవి. కానీ, 2000 సంవత్సరంలో దాదా భారత జట్టు పగ్గాలు చేపట్టాక రూపురేఖలు మారిపోయాయి. జట్టులోకి యువ ఆటగాళ్లకు ప్రవేశం లభించింది. యువ రక్తంతో నిండిన కొత్త జట్టు అప్పటి అగ్ర జట్లకు సవాల్ విసిరేది. ఇలా చెప్పుకోవాలంటే.. దాదా హయాంలోని రోజులు, జ్ఞాపకాలు మరుపురానివి. విజయాల పరంగా, ఐసీసీ టైటిల్స్ అందించడంలో ధోని విజయవంతమయ్యాడేమో కానీ, జట్టును నిర్మించడంలో దాదాదే అసలు విజయం.
వన్డేల ద్వారా 1992లో అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన గంగూలీ, 2008, నవంబర్ 8న తన చివరి టెస్ట్ ఆడాడు. ఈ 16 ఏళ్ల తన కెరీర్ లో మరుపురాని విజయాలు, చోటుచేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆపై అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా ఐపీఎల్ ద్వారా అభిమానులకు టచ్ లోనే ఉండేవారు. ఆ తరువాత మెంటర్ గా, బీసీసీఐ మాజీ అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ గానూ కొనసాగుతున్నారు. క్రికెట్ కు దూరమైన దాదా.. ఇలా ఏదో ఒక విధంగా అభిమానులతోనే ఉంటున్నాడు. తాజాగా, దాదా ‘గోల్డ్ స్మగ్లర్’గా అభిమానుల ముందుకొచ్చాడు.
అవును ‘రిచ్ మారీ’ బిస్కెట్స్ యాడ్‌లో గంగూలీ ఒక గోల్డ్ స్మగ్లర్. దాదా సరిగ్గా ఆ గ్యాంగ్‌స్టర్ పాత్రకు సరిపోయాడనే చెప్పాలి. “మోనా డార్లింగ్ బంగారం ఎక్కడ ఉందంటూ ప్రశ్నించడం మొదలుపెట్టిన దాదా, గోల్డ్ కాయిన్ గెలవడం బిస్క్ ఫామ్ రిచ్ మేరీని కొనుగోలు చేసినంత సులభం ..వెళ్లండి మీ అవకాశాన్ని పొందండి..” అంటూ తన ప్రకటనను ముగిస్తాడు. ప్రస్తుతం ఈ యాడ్ షూట్ నెటిజన్స్ చేత మన్ననలు పొందుతోంది. మీరూ ఈ యాడ్ చూసి.. దాదా నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.