క్రికెట్‌లో రకరకాల బౌలింగ్ యాక్షన్‌లు ఉంటాయి. కొంత మంది బౌలర్లు వారి బౌలింగ్ యాక్షన్‌తో బ్యాటర్లను తికమకపెట్టడమో.. లేక ప్రేక్షకులను ఆకట్టుకోవడమో చేస్తుంటారు. కానీ ఒక బౌలర్ మాత్రం తన బౌలింగ్ యాక్షన్‌తో ఏకంగా భయపెడుతోంది. ఆ క్రికెటర్ బౌలింగ్ యాక్షన్ చూస్తే.. మన కళ్లను మనమే నమ్మడం కష్టంగా ఉంది. ఈ రిఫరెంట్ బౌలింగ్ మహిళల టీ20 ఛాలెంజ్ టోర్నీలో చోటు చేసుకుంది. మంగళవారం సూపర్‌నోవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ స్పిన్నర్ సోనావానే ప్రత్యేక బౌలింగ్ యాక్షన్‌తో అందర్ని ఆశ్యర్యపర్చింది.
సోనావానే డెలివరీ వేసేటప్పడు తన తలను బాగా కిందకు ఉంచి బౌలింగ్ చేస్తుంది. సోనావానే బౌలింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. కాగా సోనావానే బౌలింగ్ యాక్షన్‌ను మాజీ దక్షిణాఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పాల్ ఆడమ్స్‌తో అభిమానులు పోల్చుతున్నారు. అతని బౌలింగ్ యాక్షన్ కూడా సోనావానే బౌలింగ్ యాక్షన్‌ను పోలీ ఉండడం విశేషం. ఈమె బౌలింగ్ చూసిన నెటిజన్లు, క్రికెట్ అభిమానులు అసలు ఆమె శరీరంలో ఎముకలు అనేవి ఏమైనా ఉన్నాయా? అంటూ ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సూపర్‌నోవాస్‌పై 7 వికెట్ల తేడాతో వెలాసిటీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్‌నోవాస్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. నోవాస్ బ్యాటర్లలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక వెలాసిటీ బౌలర్లలో క్రాస్ రెండు వికెట్లు, దీప్తీ శర్మ, రాధా యాదవ్ తలా వికెట్ సాధించారు. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెలాసిటీ 3 వికెట్లు కోల్పోయి చేధించింది. వెలాసిటీ బ్యాటర్లలో షఫాలీ వర్మ(51),లారా వోల్వార్డ్ట్(51) పరుగులతో రాణించారు. మరి సోనావానే బౌలింగ్ యాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Ravichandran Ashwin: తనని తాను ఎంఎస్ ధోని అనుకున్న అశ్విన్! పాపం పరాగ్..
Debut for 23 year old leg spinner from Maharashtra, Maya Sonawane#My11CircleWT20C#WomensT20Challenge2022 pic.twitter.com/IRylJ62EGx
— WomensCricCraze🏏( Womens T20 Challenge) (@WomensCricCraze) May 24, 2022
Paul Adams 🤝 Maya Sonawane
Bowling action🤸♀️📸: IPL/ BCCI pic.twitter.com/Zx3dBSbS4J
— CricTracker (@Cricketracker) May 24, 2022