సాధారణంగా క్రికెట్ టూర్లలో భాగంగా చాలా మంది ఆటగాళ్లు తమ ఫ్యామిలీని వెంటబెట్టుకుని వెళ్తారు. అయితే ఈ క్రమంలో అక్కడ కొన్ని కొన్ని సరదా సన్నివేశాలను చోటుచేసుకుంటుంటాయి. వాటిని సదరు ఆటగాళ్లు తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం టీమిండియా.. న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలోనే మూడో వన్డే కోసం తమ ఫ్యామిలీలతో క్రైస్ట్ చర్చి బయలుదేరింది టీమిండియా జట్టు. అప్పుడో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. దీన్నంతటినీ వీడియో తీసి తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
శిఖర్ ధావన్.. మ్యాచ్ అనంతరం డ్రస్సింగ్ రూమ్ లో ఎంత రచ్చ రచ్చ చేస్తాడో మనందరికి తెలిసిందే. తన డ్యాన్స్ లతో, డబ్ స్మాష్ లతో అభిమానులను ఎప్పుడు అలరిస్తుంటాడు. తాజాగా అలాంటి వీడియోనే షేర్ చేశాడు ఈ గబ్బర్. న్యూజిలాండ్ తో జరిగే మూడో వన్డే కోసం టీమిండియా క్రైస్ట్ చర్చ్ కు పయనం అయ్యింది. ఈ క్రమంలోనే తమ ఫ్యామీలతో బయలుదేరారు అందరు క్రికెటర్లు. ఇక టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ రెండు బ్యాగులు, రెండు సూట్ కేసు లగేజీలను తీసుకురావడాన్ని వీడియో తీస్తున్నాడు ధావన్. ఆ వెనకాలే చాహల్ భార్య ధనశ్రీ వర్మ మాత్రం కేవలం ఒకే ఒక్క లగేజీతో రావడం చూసిన ధావన్ చూడండి చాహల్ ని ఎలాకూలీని చేసిందో చూడండి అన్నాడు. దానికి ఆమె నా కాళ్లు నొస్తున్నాయి.. అందుకే అతడు లగేజీ తీసుకొస్తున్నాడు అంటూ ధనశ్రీ సమాధానం చెప్పింది. దాంతో ధావన్ అవునా అంటూ వీడియో తీస్తూ ఆటపట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక బుధవారం జరిగే మూడో వన్డేలో గెలిచి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది టీమిండియా.