మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలిరోజు శుక్రవారం భారత్ 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. రిషబ్ పంత్ కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు. 97 బంతుల్లో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. సెంచరీ చేజార్చుకున్నా కూడా ఆడిన ఇన్నింగ్స్‌కు అభినందనలు దక్కాయి. దాంతో పాటు ఒక చెత్త రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధికంగా 90పైచిలుకు పరుగులు చేసి సెంచరీ చేయకుండా అవుట్ అయిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రపంచ రికార్డును పంత్ సమం చేశాడు. ఇప్పటి వరకు 90 పరుగులు చేసిన తర్వాత ఐదు సార్లు సెంచరీ చేయకుండా అవుట్ అయిన వికెట్ కీపర్‌గా ధోనీతో పాటు నిలిచాడు. అదే సమయంలో అతని తర్వాత క్వింటన్ డి కాక్ పేరు వస్తుంది. డికాక్ 4 సార్లు సెంచరీ కోల్పోయాడు.
అలాగే మరో చెత్త రికార్డును కూడా పంత్ సమం చేశాడు. 25 ఏళ్ల వయసులోపు 90ల్లో అత్యధిక సార్లు అవుట్ అయిన రికార్డును కూడా పంత్ సమం చేశాడు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ కూడా ఇలాగే 5 సార్లు సెంచరీ చేయకుండా అవుట్ అయ్యాడు. దీంతో డివిలియర్స్ సరసన చేరాడు పంత్. 90-100 పరుగుల మధ్య అవుట్.. పంత్, 2018లో రాజ్‌కోట్, హైదరాబాద్‌లో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో 92 పరుగులతో ఔటయ్యాడు. ఈ ఏడాది శ్రీలంకపై 96 పరుగుల వద్ద ఔటయ్యాడు. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టులో 97 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో, 2021లోనే, ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో 91 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. పంత్ ప్రస్తుతం 29 మ్యాచ్‌ల్లో 40.69 సగటుతో 1831 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. గతంలో సచిన్ కూడా 90 పరుగుల దాటిన తర్వాత చాలా ఒత్తిడికి గురై అవుట్ అయిన సందర్భాలు ఉన్నాయి. 99 వద్ద కూడా సచిన్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు పంత్‌కు కూడా అలాంటి రోగమే పట్టినట్లు ఉంది. మరి పంత్ సెంచరీ మిస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ICYMI – @RishabhPant17‘s 96-run blitz on Day 1.
Fell agonisingly short of a well-deserved century. 96 runs, 97 balls, 9 boundaries, 4 sixes – This was batting that oozed confidence epitome.
📽️📽️https://t.co/fiU0R4SInp #INDvSL
— BCCI (@BCCI) March 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.