యాషెస్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వెరైటీ ఫీల్డ్ సెటప్ తో ఆకట్టుకుంటున్నాడు. తొలి రోజు ఆటలో భాగంగా స్టీవ్ స్మిత్ కోసం ఏర్పాటు చేసిన ఫీల్డింగ్ ఆశ్చర్యానికి గురి చేయగా.. తాజాగా ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకి కూడా ఇలాగే ఫీల్డ్ ని ఏర్పాటు చేశాడు.
యాషెస్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వెరైటీ ఫీల్డ్ సెటప్ తో ఆకట్టుకుంటున్నాడు. అగ్రెస్సివ్ క్రికెట్ కి కొత్త అర్ధం చెబుతూ అన్నిట్లో దూకుడుగా వ్యవహరిస్తున్న ఇంగ్లాండ్.. ఫీల్డింగ్ ని కూడా ఎవ్వరు ఊహించని రీతిలో సెట్ చేస్తూ అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. ప్రతిష్టాత్మక యాషెస్ లో వికెట్ కోసం చేసిన చేసే ప్రతి ప్రయత్నం ఇంగ్లాండ్ కి కలిసి వస్తుంది. తొలి రోజు ఆటలో భాగంగా స్టీవ్ స్మిత్ కోసం ఏర్పాటు చేసిన ఫీల్డింగ్ ఆశ్చర్యానికి గురి చేసింది. మూడు స్లిప్పులతో పాటుగా గాలిని ఏర్పాటు చేసి రెండు లెగ్ స్లిప్ లను కూడా ఉంచాడు. ఏదో ఒక టెయి లండర్ కి ఫీల్డ్ సెటప్ చేసినట్లుగా అనిపించింది. ఇక తాజాగా ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకి కూడా ఇలాగే ఫీల్డ్ ని ఏర్పాటు చేశాడు.
యాషెస్ లో ఇంగ్లాండ్ దూకుడే మంత్రంగా దూసుకెళ్తుంది. మూడో రోజు 312/5 తో ఆటను ప్రారంభించిన ఆసీస్..ఫోర్లు, సిక్సులతో మొదటి గంట పరుగుల వరద పారించింది. ముఖ్యంగా సెంచరీ హీరో ఖవాజా.. గ్రీజ్ లో పాతుకుపోయాడు. ఈ దశలో కెప్టెన్ స్టోక్స్.. ఖవాజాకి ఆశ్చర్యకరమైన రీతిలో ఫీల్డింగ్ సెట్ చేసాడు. ఆఫ్ సైడ్ దగ్గరగా ముగ్గురు ఫీల్డర్లతో పాటు.. లెగ్ సైడ్ కూడా ముగ్గురు ఫీల్డర్లను ఉంచాడు. దీంతో ఫీల్డర్లు అందరూ అక్కడే ఉండడంతో ఖవాజా ఒత్తిడిలో పడిపోయాడు. ఎటాకింగ్ చేద్దాం అనే ఉద్దేశ్యంలో రాబిన్సన్ బౌలింగ్ లో ఫ్రంట్ కి వచ్చి అది క్లీన్ బౌల్డయ్యాడు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు చక చక మిగిలిన మూడు వికెట్లు కూడా తీసి స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 130 పరుగులు చేసింది. ఒక వైపు వేగంగా పరుగులు చేస్తున్నా..మరో వైపు వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. రూట్ 46 పరుగులతో రాణించారు. క్రీజ్ లో బ్రూక్(39) కెప్టెన్ స్టోక్స్ ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం ఇంగ్లాండ్ 137 పరుగుల ఆధిక్యంలో ఉంది. వీరిద్దరు ఎంతసేపు ఆడతారనేదానిపైనే ఇంగ్లాండ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మొత్తానికి స్టోక్స్ చేసిన కెప్టెన్సీ అనుకూల ఫలితాలనిచ్చింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Only in Test Cricket 😍
An unconventional field setup from 🏴 forced Usman Khawaja to come down the track and ended up getting bowled 😲👏#SonySportsNetwork #TheAshes #ENGvAUS #RivalsForever pic.twitter.com/jb0XKnBJCv
— Sony Sports Network (@SonySportsNetwk) June 18, 2023