2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా, శ్రీలంకను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. అంతకు ముందు సెమీ-ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడినా.. పాక్ బౌలర్ వహాబ్ రియాజ్ ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. టీమిండియా మేటి బ్యాటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ధోని, విరాట్ కోహ్లీలను ఒక విధంగా అవుట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ మ్యాచ్‌లో మొత్తం అయిదు వికెట్టు తీసిన ఆ బౌలర్ ప్రస్తుతం రోడ్డు పక్కన వేయించిన పల్లీలు అమ్ముకుంటూ కనిపించాడు.
ప్రస్తుతం అతను పాకిస్తాన్ జట్టులో లేడు. అలా అని ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిని ఈ స్థితికి రాలేదులేండీ.. సరదాగా రోడ్డు పక్కన పప్పులు, పల్లీలు అమ్ముకునే బండి వద్ద పల్లీలు వేయిస్తూ.. ఆ వీడియోను సోషల్‌మీడియాలో పెట్టాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా వహాబ్ డిసెంబర్ 2020 నుంచి పాక్ జట్టుకు దూరమయ్యాడు. 36 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ 27 టెస్టుల్లో 83 వికెట్లు తీశాడు. 91 వన్డేల్లో 120 వికెట్లు, 36 టీ20ల్లో 34 వికెట్లు పడగొట్టాడు. మరి ఈ క్రికెటర్ సరదాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆ వ్యాధితో పాకిస్థాన్‌లో 7,462 మంది చిన్నారులు మృతి!
Your “Chano wala Cha-cha” of the day!
Send your orders “kia banaon aur kitnay ka banaun”? 🤣P.S.
Loved spending some time around this special handcart reminded me of my childhood days. pic.twitter.com/gbfP2EJJso— Wahab Riaz (@WahabViki) January 10, 2022