వరల్డ్ క్రికెట్‌లో పాకిస్థాన్ జట్టు తీరే వేరు. ఆ దేశ ప్లేయర్లు ఆడేతీరు, వ్యవహరించే తీరు, వారి గేమ్ ప్లాన్ ఇలా ఏది చూసుకున్నా కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. ఎన్నో అంచనాలతో బరిలో దిగినప్పుడు ఓడిపోవడం.. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా గ్రౌండ్‌లోకి దిగి ప్రత్యర్థిని చితక్కొట్టడం పాక్‌కే చెల్లింది. చాలా టోర్నీల్లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగి ఎన్నో విజయాలు సాధించిన చరిత్ర దాయాది దేశానికి ఉంది. పాక్ మెన్స్ టీమ్‌తోపాటు విమెన్స్ టీమ్ కూడా కాస్త విభిన్నమనే చెప్పాలి. పాక్ విమెన్స్ ప్లేయర్ల బ్యాటింగ్ స్టయిల్, ఫీల్డింగ్ విన్యాసాలపై జోకులు పేలుతుండటం సర్వసాధారణమే. తాజాగా మరోసారి పాక్ విమెన్ క్రికెటర్ ఒకరు ట్రెండింగ్‌లో నిలిచారు. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుతో జరిగిన మూడో వన్డేలో పాకిస్థాన్ విమెన్స్ టీమ్ కీపర్ మునీబా అలీ ఆడిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.
ఆసీస్ బ్యాటర్ జొనాసన్‌ను సునాయసంగా ఔట్ చేసే చాన్స్‌ను వదిలేసినందుకు మునీబా అలీపై సోషల్ మీడియా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. జొనాసన్ 8 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఫాతిమా బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించింది. క్రీజు వదిలి ముందుకొచ్చి ఆడే ప్రయత్నంలో బాల్ ఎడ్జ్ తగిలి అక్కడే పడింది. రన్ తీసేందుకు ప్రయత్నించగా.. వికెట్ల వెనుక ఉన్న మునీబా అలీ పరిగెత్తుకొచ్చి బాల్‌ను పట్టుకుంది. కానీ రనౌట్ చేయడంలో మాత్రం ఫెయిలైంది. బాల్ చేతిలో ఉన్నా కొట్టకుండా అక్కడే గింగిరాలు తిరిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇలా ఎవరైనా కీపింగ్ చేస్తారా? ఇంత సులువైన చాన్స్‌ను మిస్ చేసిన మునీబా జట్టులో ఉండటం వేస్ట్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.
మునీదా మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందంటూ మరికొందరు నెటిజన్స్ తీవ్రంగా కామెంట్లు పెడుతున్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 336 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్ విమెన్స్ టీమ్ అన్ని ఓవర్లు ఆడి కేవలం 235 పరుగులే చేయగలిగింది. కీపింగ్‌లో ఫెయిలైన మునీబా అలీ.. బ్యాటింగ్‌లో 27 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో 101 రన్స్ తేడాతో గెలిచిన కంగారూ జట్టు.. సిరీస్‌ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది. మరి, మునీబా కీపింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
She suddenly remembered that Australia has promised some Wheat Flour in return for win. #AthiyaShetty #kuldeepyadav #PakistaniGirl
pic.twitter.com/xI4ihd4Dpx— INDIA wale (@Mahesh9999755) January 21, 2023