తమిళ కమెడియన్ యోగి బాబుకు ధోని బ్యాట్ గిఫ్ట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ఓ నెటిజెన్.. దక్షిణాది వారిని కించపరుస్తూ ట్వీట్. అందుకు ప్రతిగా సౌత్ పీపుల్ నుంచి దిమ్మతిరిగే కౌంటర్లు. ఈ వ్యవహారంపై అభిమానుల మద్య సోషల్ మీడియా వేదికగా వాడీవేడిగా రచ్చ.
టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోనికి, చెన్నైకి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. తన సొంత మైదానం రాంచీ అయిన, చెన్నై వేదికగా తన చివర మ్యాచ్ ఆడాలన్నా ఉద్దేశ్యంతో తన రిటైర్మెంట్ ను వాయిదా వేసుకున్నాడు ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథిగా ఎన్నో మరుపురాని విజయాలు అందించిన ధోనీకి.. తమిళ అభిమానులు తమ హృదయాల్లో ప్రత్యేక స్థానం కల్పించారు. అలా ధోనీని ప్రత్యేకంగా ఆరాధించే అభిమానుల్లో తమిళ కమెడియన్ యోగి బాబు ఒకరు. ఈ విషయం తెలుసుకున్న ధోని అతడికి ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌ను గిఫ్ట్‌గా పంపడం, అందుకు సంబంధించిన ఫోటోలను యోగి బాబు ట్విటర్లో షేర్ చేయడం అందరికీ విదితమే.
దీన్ని ఓర్చుకోలేని ఓ నెటిజెన్ దక్షిణాది వారిని ఉద్దేశిస్తూ అసభ్యకరంగా ట్వీట్ చేశాడు. “దక్షిణాది వారందరు ఎందుకు నల్లగా ఉంటారంటూ..” అగౌరవ పరిచే విధంగా కామెంట్ చేశాడు. అందుకు ప్రతిగా మరో నెటిజెన్.. ‘బ్రిటిష్ వారిని ఉద్దేశిస్తూ..’ అతనికి సరైన కౌంటరిచ్చారు. ఈ ట్వీట్ల వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. అభిమానులు రెండు భాగాలుగా విడిపోయి ప్రాంతీయ బేధాలను లేవనెత్తుతూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. ట్వీట్ల వార్ జరుగుతోంది. దక్షిణాది వారిని కించపరుస్తూ నెటిజెన్ చేసిన ట్వీట్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Netizen controversial comments over dhoni bat gifted to yogi babu.. pic.twitter.com/O8zeoB80h1
— Govardhan Reddy (@gova3555) February 17, 2023
Direct from #MSDhoni hands which he played in nets . Thankyou @msdhoni sir for the bat …. Always cherished with the – your cricket memory as well as cinematic memory #dhonientertainmentprod1 #sakshidhoni . pic.twitter.com/2iDv2e5aBZ
— Yogi Babu (@iYogiBabu) February 15, 2023