క్రికెట్ లో స్లెడ్జింగ్ చేయడం, తోటి-ప్రత్యర్థి ఆటగాళ్లను అనుకరించడం ఎప్పటినుంచో ఉన్నదే. ఒకప్పుడు ఇలా చేస్తే క్రికెటర్లు కోప్పడేవారు గానీ టీ20 లీగ్స్ పెరిగిన తర్వాత అన్ని దేశాల క్రికెటర్లు చాలా వరకు ఫ్రెండ్స్ అయిపోయారు. ఐపీఎల్ పుణ్యామా అని విదేశీ ఆటగాళ్లు చాలామంది.. భారత క్రికెటర్లతో మంచి రిలేషన్స్ మెంటైన్ చేస్తూ వస్తున్నారు. మిగతా లీగ్స్ లోనూ ఇలా సొంత దేశం కావొచ్చు.. విదేశీ క్రికెటర్లతో కావొచ్చు కొన్నిసార్లు పలువురు క్రికెటర్లు పరాచకాలు ఆడుతుంటారు. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే జరిగింది.
ఇక విషయానికొస్తే… ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. ఇందులో పాక్ క్రికెటర్లు కూడా ఉన్నారు. తాజాగా జరిగిన కుల్నా టైగర్స్ జట్టుపై కొమిల్లా విక్టోరియన్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 210/2 రన్స్ చేయగా.. ఛేదనలో విక్టోరియన్స్ చెలరేగి ఆడారు. 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేశారు. అయితే ఈ మ్యాచులో కుల్నా టైగర్స్ జట్టుకు చెందిన ఆజమ్ ఖాన్ బ్యాటింగ్ చేస్తుండగా.. యువ పేసర్ నసీమ్ షా బౌలింగ్ చేశారు. ఓ టైంలో అజామ్.. క్రీజు దగ్గరకు వస్తుండగా ఎదురొచ్చాడు. దీంతో నసీమ్ ని తోసేసిన అతడు సరదాగానే నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.
ఆ తర్వాత మాత్రం అజామ్ ఖాన్ భారీ కాయాన్ని గుర్తుచేసేలా నసీమ్ ఖాన్ చేతులు పక్కగా పెట్టి నడిచారు. దీన్ని అజామ్ ఖాన్ చూడలేదు. ఇక ఇప్పుడు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వతహాగా పాక్ ఆటగాళ్లయిన వీళ్లిద్దరూ కూడా దీన్ని సరదాగా తీసుకున్నప్పటికీ.. నెటిజన్స్ మాత్రం అస్సలు వదిలిపెట్టడం లేదు. తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా పాక్ మాజీ స్టార్ క్రికెటర్ మొయిన్ ఖాన్ కొడుకే ఈ ఆజామ్ ఖాన్.. రీసెంట్ గా బంగ్లా ప్రీమియర్ లీగ్ లోనే 58 బంతుల్లో 109 రన్స్ చేసి అందరినీ ఎట్రాక్ట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ చూసిన చాలామంది.. త్వరలో ఇతడు పాక్ జట్టులోకి రావడం పక్కా అని కామెంట్స్ పెడుతున్నారు. అలానే తండ్రికి తగ్గ తనయుడు అని అంటున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే.. అజామ్ ఖాన్ ని నసీమ్ షా ఇమిటేట్ చేసిన దానిపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Hahaha 😂😂 @iNaseemShah @MAzamKhan45 pic.twitter.com/3bgzpOY6L2
— Thakur (@hassam_sajjad) January 31, 2023