దేశంలో ఒకప్పుడు భారత్- పాకిస్థాన్ మ్యాచులు అభిమానులకి ఎంతలా మాజాని ఇస్తాయో ప్రతేకంగా చెప్పనవసరం లేదు. సరిగ్గా యాషెస్ విషయానికి వస్తే అంతకు మించిన క్రేజ్ ఈ రెండు జట్ల మధ్య సొంతం. దాదాపు 140 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్ ఇప్పటికీ అభిమానులకి వినోదాన్ని పంచుతూనే ఉంది. దీని క్రేజ్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అయితే ప్రతీకార పోరుగా భావించే యాషెస్ లో స్లెడ్జింగ్ కూడా ఉంటుంది. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జాన్సన్-బ్రాడ్ స్లెడ్జింగ్.
మాకు వరల్డ్ కప్ రాకపోయినా పర్లేదు యాషెస్ మాత్రం కావాలి. ఈ డైలాగ్ ప్రతి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అభిమానుల నోటి నుంచి వినిపిస్తుంది. యాషెస్ వస్తే ఆ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. స్టేడియం ఆడియన్స్ తో నిండి పోతుంది. టెస్టు క్రికెట్ అయినా కూడా బంతి బంతికి అరుపులు, కేకలు. ఇక మ్యాచ్ గెలిస్తే ఏదో సాధించిన ఫీలింగ్. రెండు జట్లు తలపడే ఈ టెస్టు సిరీస్ ని ఎందుకు ఇంత సీరియస్ గా, ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో సగటు క్రికెట్ ప్రేమికుడి సందేహం. ఇంతకీ టీ 20 లను, వన్డే వరల్డ్ కప్ ని మించే కిక్ ఇందులో ఏముంటుంది? ఇదంతా తెలుసుకోవాలంటే యాషెస్ కి ఒక పెద్ద హిస్టరీనే ఉంది.
దేశంలో ఒకప్పుడు భారత్- పాకిస్థాన్ మ్యాచులు అభిమానులకి ఎంతలా మాజాని ఇస్తాయో ప్రతేకంగా చెప్పనవసరం లేదు. సరిగ్గా యాషెస్ విషయానికి వస్తే అంతకు మించిన క్రేజ్ ఈ రెండు జట్ల మధ్య సొంతం. క్రికెట్ 1877 లో స్టార్ట్ అయితే 1882 లోనే యాషెస్ పుట్టుకొచ్చింది. అప్పటినించి ఈ రెండు జట్ల మధ్య పోరుని అభిమానులు వరల్డ్ కప్ రేంజ్ లో ఫీలవుతారు. 2006వ సంవత్సరంలో వరల్డ్ వైడ్ గా నిర్వహించిన ఒక సర్వే లో 77 శాతం మంది క్రికెట్ ఫ్యాన్స్ మాకు వరల్డ్ కప్ చూడటం కన్నా యాషెస్ సిరీస్ చూడటం అంటేనే ఎక్కువ ఇష్టం అని వోట్ చేయడం విశేషం. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా యాషెస్ క్రేజ్ అంటే అలాగే ఉంటుంది. దాదాపు 140 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్ ఇప్పటికీ అభిమానులకి వినోదాన్ని పంచుతూనే ఉంది. దీని క్రేజ్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అయితే ప్రతీకార పోరుగా భావించే యాషెస్ లో స్లెడ్జింగ్ కూడా ఉంటుంది. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జాన్సన్-బ్రాడ్ స్లెడ్జింగ్.
2013-14 లో యాషెస్ ఇంగ్లాండ్ లో జరిగింది. సొంత గడ్డపై విశ్వరూపం చూపించిన ఈ సిరీస్ ని ఇంగ్లాండ్ 3-0 తో గెలుచుకుంది. ఇక ఈ సిరీస్ లోని ఒక మ్యాచులో ఆస్ట్రేలియా పేసర్ మిట్చెల్ జాన్సన్, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ మధ్య ఒక భారీ స్లెడ్జింగ్ చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా బ్రాడ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జాన్సన్ వచ్చి ఏకంగా బ్రాడ్ చెల్లెలి గురించి వల్గర్ కామెంట్స్ చేసాడు. బూతులు తిడుతూ బాధించే మాట్లాడు మాట్లాడాడు. అయితే దీనికి బ్రాడ్ కూడా నవ్వుతూనే జాన్సన్ కి రివర్స్ పంచ్ ఇచ్చాడు. యాషెస్ సిరీస్ అంటే స్లెడ్జింగ్ ఉండడం కామనే అయినా.. ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఈ టోర్నీ ప్రతిష్టని కాస్త దిగజారుస్తుంది. యాషెస్ చరిత్రలోనే ఇదొక చేదు సంఘటనగా చెప్పుకొస్తారు.