ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వివాదంలో చిక్కుకున్నాడు. తనను మోసం చేశాడంటూ క్లార్క్ ప్రియురాలు జేడ్ యార్బ్రో అతడి చెంపలు వాయించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాతో ప్రేమ అంటూ మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకుంటావా అంటూ అతని గర్ల్‌ఫ్రెండ్ యార్బ్రో బహిరంగంగా క్లార్క్ చెంపలు వాయించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జనవరి 10న చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
వీడియోలో క్లార్క్ నిక్కర్ పైనే ఉన్నాడు. యార్బ్రో రోడ్డుపైనే ‘నువ్వు ఆమె(క్లార్క్ మాజీ ప్రేయసి పిప్ ఎడ్వర్డ్స్)తో గడిపావ్.. నువ్వు కుక్కవి..’ అంటూ రెండుసార్లు చెంపలపై కొట్టింది. క్లార్క్ ఆమెకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆమె కన్విన్స్ కాకపోగా, మరింత రెచ్చిపోయింది. భూతులు తిడుతూ.. పలానా రోజు నువ్వు ఆమెతో గడిపావు, నువ్వో కుక్కవు అంటూ బహిరంగంగా క్లార్క్‌పై దాడికి దిగింది. తానే తప్పు చేయలేదని క్లార్క్ సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. ఫోన్ చాట్‌ను బయటపెట్టాలని గట్టిగా అరవడం చేసింది.
⛔️Watch:
michael clarke karl stefanovic fight video.
karl stefanovic and michael clarke fight.
Michael Clarke and Stefanovic fight 🙈🤣
his girlfriend, and Karl Stefanovic at a public park in Noosa.
#MichaelClarke#leakedvideos #fight#jamespackerhttps://t.co/YzDBWZzzK1 pic.twitter.com/4LQn3zmDKJ— What_ever (@SoeverWhat) January 19, 2023
క్లార్క్, యార్‌బ్రో, ఆమె సోదరుడు కార్ల్ స్టెఫానోవిక్ మరియు అతని భార్య నలుగురు కలిసి భోజనం చేస్తుండగా ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. క్లార్క్ తన మాజీ ప్రేయసి పిప్ ఎడ్వర్డ్స్‌తో సంప్రదింపులు జరిపాడన్నది ప్రధాన ఆరోపణ. భోజనం చేస్తున్నప్పుడు ఈ విషయం చర్చకు రావడం, సహనం కోల్పోయిన ఆమె, నమ్మకద్రోహి అంటూ అతని చెంపలు వాయించడం చకచకా జరిగిపోయాయి. అనంతరం యార్బ్రో అతనిపై పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఉదంతంపై స్పందించిన క్లార్క్.. బహిరంగంగా ఇలా ప్రవర్తించినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాడు.
కాగా, క్లార్క్ తన భార్య కైలీతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2012లో కైలీని వివాహం చేసుకున్న క్లార్క్.. 2020 ఫిబ్రవరి 20న పరస్పర అంగీకారంతో తాము విడిపోతున్నట్లు ప్రకటించాడు. క్లార్క్, ఆసీస్ తరఫున 115 టెస్ట్‌లు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో అతను 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీ సాయంతో 8643 పరగులు చేయగా.. వన్డేల్లో 8 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీల సాయంతో 7981 పరుగులు చేశాడు. టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 488 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో క్లార్క్ అత్యధిక స్కోర్ 329 నాటౌట్‌గా ఉంది.