‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’లో పాకిస్తాన్ కథ ముగిసింది. సెమీస్-2లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. బై బై పాకిస్తాన్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. హోరాహోరీ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఫైనల్ చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదట తడబడింది. వార్నర్, స్టొయినిస్, మాథ్యూవేడ్ మెరుపు బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా విజయం సాధించి.. ఫైనల్ చేరింది. అప్పటివరకు పాకిస్తాన్‌దే మ్యాచ్ అనుకున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వార్నర్ విరుచుకుపడటం, స్టొయినిస్, వేడ్ ద్వయం చెలరేగడంతో పాకిస్తాన్ బౌలర్లు తలొగ్గక తప్పలేదు. ఒక ఓవర్ మిగిలుండగానే ఆస్ట్రేలియా ఆటను ముగించేసింది. మ్యాచ్ ఫలితాన్ని పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో పాకిస్తాన్ ప్లేయర్ రిజ్వాన్ పేరు బాగా వైరల్ అవుతోంది. వారి కోచ్ మాథ్యూ హేడెన్ చెప్పిన మాటలే అందుకు కారణం.
Matthew Hayden says despite being a Christian, he’s curious about Islam and Mohammad Rizwan has even given him an English version of the Holy Quran.#T20WorldCup | #Pakistan pic.twitter.com/kL9ke4M7dh
— Grassroots Cricket (@grassrootscric) November 9, 2021
రిజ్వాన్(52 బంతుల్లో 67) ఓపినింగ్‌లో వచ్చి 17.2 ఓవర్ల వరకు నిలబడి పాకిస్తాన్ భారీ స్కోర్ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. అతను అంతసేపు క్రీజులో ఉండి ఆడగలిగాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. మ్యాచ్ అనంతరం రిజ్వాన్ వారియర్ అంటూ హేడెన్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. మ్యాచ్‌కు ముందు రెండ్రోజులు కూడా రిజ్వాన్ ఆస్పత్రిలో ఐసీయూ బెడ్‌పై ఉన్నాడు. తీవ్రమైన చెస్ట్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ రెండ్రోజులు ఐసీయూలోనే గడిపాడు. అయినా కూడా అతను ఆడిన తీరు.. అంతసేపు క్రీజులో ఉండి భారీ స్కోర్ కొట్టడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మాథ్యూ హేడెన్ రిజ్వాన్‌ను వారియర్ అనడం నూటికి నూరు శాతం కరెక్ట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Mohammad Rizwan in hospital the night before the match against Australia. He had developed a severe chest infection and spent 2 nights in the ICU #T20WorldCup #PAKvAUS pic.twitter.com/E7qbcxdJmg
— Saj Sadiq (@SajSadiqCricket) November 11, 2021