2018 లో దక్షిణాఫ్రికా తో మ్యాచ్ సందర్భంగా బాల్ టాంపరింగ్ చేయడంతో స్టీవ్ స్మిత్, బాంక్రాఫ్ట్ తో పాటుగా..వార్నర్ కూడా నిషేధాన్ని గురయ్యాడు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఒక విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా మీద వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ పరిస్థితి ప్రస్తుతం ఏమంత బాగా లేదని తెలుస్తుంది. ఓ వైపు సన్ రైజర్స్ తో వివాదాలు, బాల్ టాంపరింగ్ తో ఉదంతంలో ఆస్ట్రేలియా విధించితిన్ బ్యాన్.. ఫామ్ లో లేకపోవడం.. వార్నర్ కెప్టెన్ గా వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ ఐపీఎల్ లో దారుణమైన ప్రదర్శన చేయడం ఇలా ఎన్నో కారణాలు వార్నర్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ నెల 7న జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్, ఆ తర్వాత యాషెస్ సిరీస్ లో ఈ స్టార్ బ్యాటర్ చోటు దక్కడం కూడా అనుమానంగా మారింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా మీద వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.
2018 లో దక్షిణాఫ్రికా తో మ్యాచ్ సందర్భంగా బాల్ టాంపరింగ్ చేయడంతో స్టీవ్ స్మిత్, బాంక్రాఫ్ట్ తో పాటుగా..వార్నర్ కూడా నిషేధాన్ని గురయ్యాడు. అయితే అప్పటినుంచి మళ్ళీ ఒక సంవత్సరం నిషేధం తర్వాత జట్టులోకి వచ్చినా.. వార్నర్ కి కెప్టెన్సీ పరంగా లైఫ్ టైం బ్యాన్ విధించారు. అయితే ఈ ఉదంతంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న కెప్టెన్ స్మిత్ మీద వేటు ఎత్తేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. డేవిడ్ వార్నర్ మీద మాత్రం కెప్టెన్సీ నిషేధాన్ని మాత్రం తొలగించడం లేదు. ప్రస్తుతం ఆసీస్ జట్టుకి సారధిగా ఉంటున్న స్మిత్.. ప్యాట్ కమ్మిన్స్ మ్యాచ్ కి అందుబాటులో లేని సమయంలో కెప్టెన్సీ చేస్తున్నాడు. ఈ విషయంపై వార్నర్ తాజాగా స్పందించాడు.
వార్నర్ మాట్లాడుతూ ” ఇది దారుణం. దీన్ని ఇప్పటికైనా ముగించాలని నేను అనుకుంటున్నా కానీ వాళ్లు మాత్రం సాగతీస్తూనే ఉన్నారు. నాపైన బ్యాన్ ఎందుకు ఎత్తివేయడం లేదో మాత్రం చెప్పడం లేదు. ఎవ్వరూ బాధ్యత తీసుకోవడం లేదు, ఎవ్వరూ నిర్ణయం తీసుకోవాలని అనుకోవడం లేదు. అడ్మినిస్టేషన్‌లోనే సరైన లీడర్‌షిప్ లేదని అనిపిస్తోంది. ఇది నాకు చిరాకు తెప్పిస్తోంది. ఇంకెన్నాళ్లు ఇలా అవమానిస్తారు.. వాళ్లకేం కావాలో నేరుగా చెప్పాలి. టెస్టు మ్యాచులు జరుగుతున్నప్పుడు, నేను బిజీగా మ్యాచులు ఆడుతున్నప్పుడు లాయర్లు ఫోన్ చేస్తారు. ఏదేదో చెబుతారు. నా ఏకాగ్రతను పూర్తిగా దెబ్బతీస్తారు.9 నెలల క్రితం బ్యాన్ ఎత్తివేయాలని కోరా. ఇప్పటికీ అది ముందుకు కదలకపోవడం చాలా నిరుత్సాహపరుస్తోంది” అంటూ కామెంట్ చేశాడు. మరి వార్నర్ మీద క్రికెట్ ఆస్ట్రేలియా ఇక మీదైనా కెప్టెన్సీ బ్యాన్ తొలగిస్తుందేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.