క్రికెట్ మ్యాచ్ మధ్యలో జట్టు పరిస్థితులపై, అనుసరించాల్సిన వ్యూహాలపై ఫీల్డింగ్ టీమ్ ఆటగాళ్లు అందరూ ఒక చోట చేరి చర్చలు జరుపుతారు. గుండ్రంగా ఒకరి భుజాలపై ఒకరు చేతులేసుకుని నిల్చుంటారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇలాగే చేశారు. కాకుంటే మైదానంలో 11 మంది ఆటగాళ్లు ఉంటే చర్చల్లో 10 మంది మాత్రమే పాల్గొన్నారు. ఆ జట్టు స్టార్ ప్లేయర్ మార్క్ వుడ్ మాత్రం చర్చల్లో పాల్గొనలేదు.
ఆ సమయంలో జట్టు మొత్తం ఒక పక్కకు ఉంటే మార్క్ వుడ్ మాత్రం గ్రౌండ్‌కు అవతలి వైపు ఉన్నాడు. దీంతో అతను అక్కడికి చేరుకోలేదు. ఇంతలోనే ఆటగాళ్ల మధ్యలు జరుగుతున్నాయి. దీంతో కెమెరామెన్ జట్టు ఆటగాళ్లను, ఒంటరిగా ఉన్న మార్క్ వుడ్‌ను చూపించాడు. తనను వదిలేసి మిగతా జట్టు చర్చలు జరిపినందుకు వుడ్ ఏం బాధ పడకుండా ఆ సంఘటనను నవ్వులతో నింపేశాడు. తాను అక్కడ లేకున్నా.. ఉన్న చోటు నుంచే రెండు చేతులు వేరే ఆటగాళ్ల భుజాలపై వేస్తున్నట్లు చేయడంతో కామెంటర్లతో, ఇతర ఆటగాళ్లు నవ్వు అపుకోలేకపోయారు.
సాధారణంగానే మైదానంలో చాలా సరదాగా ఉంటే వుడ్.. జట్టు తనను ఒక్కడే వదిలేసినా కూడా దాన్ని సంతోషంగానే తీసుకోవడంతో అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. స్పోర్టివ్ నెస్ అంటే అంటూ నెటిజన్లు వుడ్‌ను మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం మార్క్ వుడ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా మార్క్ వుడ్‌ను ఐపీఎల్ మెగా వేలంలో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ రూ.7.50 కోట్ల భారీ ధరకు దక్కించిన విషయం తెలిసిందే. మరి మార్క్ స్పోర్టివ్‌నెస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mark Wood is a fantastic character for the game.pic.twitter.com/WyD1ud6VrP
— Johns. (@CricCrazyJohns) March 10, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.