లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా తాజాగా వైజాగ్ టైటాన్స్, నాగపూర్ నింజాస్ మధ్య మ్యాచ్ జరిగింది. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో వైజాగ్ టైటాన్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు స్టువర్ట్ బిన్నీ.
సాధారణంగా ఓ ఏజ్ అంటూ వచ్చాక ఏ ఆటగాడికైనా ఆటలో కాస్త పదును తగ్గుతుంది. కానీ కొంత మందిలో మాత్రం ఆ పదును మాత్రం తగ్గదు. ఇక ప్రస్తుతం జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా తాజాగా వైజాగ్ టైటాన్స్, నాగపూర్ నింజాస్ మధ్య మ్యాచ్ జరిగింది. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో వైజాగ్ టైటాన్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా లెజెండరీ బ్యాటర్లు అందరు తమలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించారు. ముఖ్యంగా స్టువర్ట్ బిన్నీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దాంతో టైటాన్స్ జట్టు 4 వికెట్లకు 189 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే మరోవైపు ప్రత్యర్థి ఆటగాడు అయిన రిచర్డ్ లెవి విధ్వంసకర ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించినంత పని చేశాడు. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
లెజెండ్స్ లీగ్ ట్రోఫీ-2023లో భాగంగా తాజాగా వైజాగ్ టైటాన్స్ వర్సెస్ నాగ్ పూర్ నింజాస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వైజాగ్ టైటాన్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. జట్టులో స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 18 బంతుల్లో 6 ఫోర్లతో 27 పరుగులు చేశాడు.మరో ఆటగాడు నిక్ కాంప్టన్(58), మల్కన్ సింగ్ (38), పరుగులతో రాణించారు. వీరందరిది ఒక లెక్క అయితే.. స్టువర్ట్ బిన్నీది ఒక లెక్క. కేవలం 18 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బిన్నీ 3 ఫోర్లు, 5 సిక్స్ లతో 49 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దాంతో వైజాగ్ టైటాన్స్ జట్టు 4 వికెట్లు నష్టపోయి 189 పరుగులు చేసింది. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నాగ్ పూర్ నింజాస్ జట్టు విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది.
ఈ క్రమంలో నింజాస్ బ్యాటర్ రిచర్డ్ లెవి విధ్వంసకర బ్యాటింగ్ తో విరుచుకుపడ్డాడు. దాంతో ఓ ఎండ్ లో నింజాస్ గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు. లెవి 44 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. టీమ్ లో మిగతా బ్యాటర్ల నుంచి సహకారం అందకపోవడంతో.. లెవి ఒంటరి పోరాటం వృథా అయ్యింది. ఇక ఆఖరి ఓవర్ లో నింజాస్ జట్టుకు 10 పరుగులు అవసరం కాగా 8 రన్స్ మాత్రమే చేసింది. బ్యాటింగ్ లో దుమ్మురేపిన బిన్నీ లాస్ట్ ఓవర్ అద్భుతంగా వేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ ఓవర్ లాస్ట్ బంతికి సిక్సర్ అవసరం కాగా క్రీజ్ లో ఉన్న హర్భజన్ బౌండరీ బాదాడు. దాంతో నింజాస్ ఓటమి తప్పలేదు.
4th Match WINNER Vizag Titans beat Nagpur Ninjas By 1 Run@khiladix_ #Khiladix #legendswillrise #LCT #T20 #Cricket #T20Cricket #BVCI #Offers #Promotions pic.twitter.com/esCLHdRzob
— Legends Cricket Trophy 2023 (@lct_2023) March 23, 2023