హీరో నాని నటించిన జెర్సీ సినిమాలోని సేమ్ సీన్ తాజాగా శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ లో రిపీట్ అయ్యింది. సినిమాలో నాని ఏవిధంగా జట్టును గెలిపించాడో.. ఈ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ అదే విధంగా కివీస్ ను గెలిపించాడు. ఇక సేమ్ టు సేమ్ ఉన్న ఈ వీడియోను ఓ అభిమాని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
సాధారణంగా దిగ్గజ క్రికెట్ ప్లేయర్ల జీవిత చరిత్రలు.. వెండితెరపై రావడం మనం చూశాం. ఇక ఆ సినిమాలో వారి మార్క్ షాట్స్ ను, బాడీ లాగ్వేజ్ ను అందులో అచ్చుగుద్దినట్లు చూపిస్తారు. అయితే క్రికెట్ లో అప్పుడప్పుడు సినిమాల్లో జరిగిన విధంగానే కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా హీరో నాని నటించిన జెర్సీ సినిమాలోని సేమ్ సీన్ తాజాగా శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ లో రిపీట్ అయ్యింది. సినిమాలో నాని ఏవిధంగా జట్టును గెలిపించాడో.. ఈ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ అదే విధంగా కివీస్ ను గెలిపించాడు. ఇక సేమ్ టు సేమ్ ఉన్న ఈ వీడియోను ఓ అభిమాని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ అసలు సిసలైన టెస్ట్ క్రికెట్ మజాను చూపించింది. కొద్ది రోజుల క్రితం ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో సైతం ఇలాంటి మజానే చూపెట్టింది కివీస్ జట్టు. సంప్రదాయ క్రికెట్ కు ఆదరణ తగ్గుతుంది అన్న తరుణంలో ఇలాంటి మ్యాచ్ లు రావడం టెస్ట్ క్రికెట్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. ఇదంతా పక్కన పెడితే.. శ్రీలంక-న్యూజిలాండ్ మ్యాచ్ లో జెర్సీ సినిమా సీన్ రిపీట్ అయ్యింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ గెలవాలి అంటే చివరి ఐదు బంతుల్లో 7 పరుగులు కావాలి.
ఈ క్రమంలో క్రీజ్ లో కేన్ విలియమ్సన్, మ్యాచ్ హెన్రీ ఉన్నారు. కివీస్ చేతిలో ఇంకా మూడు వికెట్లు ఉన్నాయి. అయితే సమన్వయలోపం తో హెన్రీ రనౌట్ గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో కేన్ మామ తర్వాత బంతిని ఫోర్ గా మలిచాడు. ఇక సమీకరణాలు చివరిగా రెండు బంతుల్లో ఒక పరుగుగా మారింది. అయితే వెంటనే డాట్ బాల్ పడటంతో.. ప్రేక్షకుల్లో నరాలు తెగే ఉత్కంఠ మెుదలైంది. ఇక చివరి బంతిని భారీ షాట్ ఆడేందుకు కేన్ మామ ప్రయత్నించి విఫలం అయ్యాడు. దాంతో సింగిల్ కు కోసం వాగ్నర్ కు సైగ చేశాడు. అయితే బాల్ అందుకున్న కీపర్ బంతిని బౌలర్ వైపు విసిరాడు. ఇక బంతిని అందుకున్న బౌలర్ ఫెర్నాండెజ్ డైరెక్ట్ గా వికెట్లకు త్రో చేశాడు. దాంతో కేన్ మామ అవుటా నాటౌటా అన్న ఆందోళన మెుదలైంది.
అయితే థర్డ్ అంపైర్ రీప్లేలో చూడగా.. విలియమ్సన్ అప్పటికే క్రీజ్ లోకి వచ్చాడు. దాంతో కివీస్ ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదంతా రియల్ లైఫ్ లో జరిగిన మ్యాచ్. ఇక ఇదే సేమ్ సీన్ టాలీవుడ్ హీరో నాని నటించిన జెర్సీ సినిమాలో ఉంది. నాని ఆ మ్యాచ్ లో తన జట్టును ఆఖరి బంతికి రనౌట్ నుంచి తప్పించుకుని గెలిపిస్తాడు. తాజాగా కేన్ మామ కూడా తన జట్టును ఇలాగే రనౌట్ నుంచి తప్పించుకుని కివీస్ ను గెలిపించాడు. ఈ రెండు మ్యాచ్ లకు సంబంధించిన లాస్ట్ బాల్ వీడియోను పక్కపక్కన పెట్టి ఓ అభిమాని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి సినిమాని తలపిస్తూ.. కివీస్ ను గెలిపించిన కేన్ మామ బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.