టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గత ఆగస్ట్ లో గాయపడ్డ సంగతి మనకు తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఆటకు దూరం అయ్యాడు బుమ్రా. అయితే తాజాగా బుమ్రాకు న్యూజిలాండ్ లో విజయవంతంగా ఆపరేషన్ చేసినట్లు సమాచారం.
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గత ఆగస్ట్ లో గాయపడ్డ సంగతి మనకు తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా అప్పటి నుంచి ఆటకు దూరం అయ్యాడు. అయితే వెన్ను నొప్పి ఆపరేషన్ కోసం బుమ్రాను న్యూజిలాండ్ కు పంపించింది బీసీసీఐ. అక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ చేత అతడికి శస్త్ర చికిత్సను చేయించనున్నారు. గతంలో ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, షేన్ బాండ్ లాంటి బౌలర్లకు శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ రోవన్ షౌటెన్.. బుమ్రాకు సర్జరీ చేశాడు. ఈ క్రమంలోనే విజయవంతంగా బుమ్రాకు సర్జరీ జరిగినట్లు సమాచారం. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
జస్ప్రీత్ బుమ్రా.. వెన్ను నొప్పి కారణంగా గత కొంతకాలంగా టీమిండియాకు దూరం అయ్యాడు. ఈ గాయంతో ఆసియా కప్-2022, టీ20 వరల్డ్ కప్ తో పాటుగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి కూడా దూరం అయ్యాడు. ఇక మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ కు సైతం బుమ్రా అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే వెన్ను నొప్పి సర్జరీ కోసం బుమ్రాను న్యూజిలాండ్ కు పంపించింది బీసీసీఐ. ఇక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ శస్త్ర చికిత్సా నిపుణుడు అయిన డాక్టర్ రోవన్ షౌటెన్.. బుమ్రాకు దిగ్విజయంగా సర్జరీ చేసినట్లు సమాచారం.
అయితే బుమ్రా సర్జరీ సక్సెస్ అయినప్పటికీ పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతో మరికొన్ని కీలక టోర్నీలకు అతడు దూరం కాక తప్పదు. ఇది భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. ఇప్పటికే బుమ్రా లేని లోటు స్పష్టంగా డెత్ ఓవర్లలో మనకు కనిపిస్తోంది. ఇక ఆపరేషన్ జరిగిన తర్వాత కనీసం 24 వారాలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ కు బుమ్రా అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ పేర్కొంది.దాంతో ఈ వార్త తెలిసిన టీమిండియా అభిమానులు తెగ సంతోష పడుతున్నారు.
Jasprit Bumrah undergoes back surgery in New Zealand
Read @ANI Story | https://t.co/Be9BZtdX9I#JaspritBumrah #cricket #TeamIndia pic.twitter.com/roRCAEt7DN
— ANI Digital (@ani_digital) March 8, 2023