కబడ్డీ ప్రేమికులను ఎంతగానో అలరిస్తున్న ప్రో కబడ్డీ లీగ్‌లో నేడు ఆసక్తికర పోరు జరగనుంది. లీగ్ ప్రారంభం రోజు తమిళ్ తలైవాస్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకున్న తెలుగు టైటాన్స్.. నేడు పుణెరీ పల్టన్స్‌తో అమితుమీ లేల్చుకోనుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఎలాగైన విజయం సాధించి, పాయింట్ల పట్టికలో ఎలాగైన తమ స్థానం మెరుగుపర్చుకోవాలని తెలుగు టైటాన్స్ జట్టు భావిస్తుంది.
ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ తమ సామర్థ్యానికి తగ్గట్టు ఆడితే గెలుపు ఖాయం. ఇక పుణెరీ పల్టన్ తమ మొదటి మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ చేతిలో ఓడింది. ఆ జట్టు కూడా మొదటి గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నించే అవకాశం ఉంది. ఇక తమ గత మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ కెప్టెన్ సిద్దార్థ్ దేశాయ్ మంచి టచ్‌లో కనిపించాడు. 11 రైడింగ్ పాయింట్లు సాధించాడు. ఇక మరో రైడర్ రజనీష్ కూడా మంచి జోష్‌లో కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు చెలరేగితే గెలుపు నల్లేరుపై నడకే. ఈ రోజు మొత్తం మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభంకానున్నది.
మొదటి మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్ , యూపీ యోధలు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్నది. మూడో మ్యాచ్ జైపూర్ పింక్ పాంథర్స్, హర్యానా స్టీలర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. మరి తెలుగు టైటాన్స్ విజయావకాశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
తెలుగు టైటాన్స్ తుది జట్టు(అంచనా)
సిద్ధార్థ్ దేశాయ్, రజనీష్, సురీందర్ సింగ్, సి అరుణ్, రుతురాజ్ కొరవి, సందీప్ కండోలా, అంకిత్ బెనివాల్/రోహిత్ కుమార్
పుణెరీ పల్టన్స్ తుది జట్టు(అంచనా)
నితిన్ తోమర్, రాహుల్ చౌదరి, పంకజ్ మోహితే, సోంబీర్, జాదవ్ షాహాజీ, విశాల్ భరద్వాజ్, సంకేత్ సావంత్/బల్దేవ్
.@PatnaPirates🆚 Pardeep Narwal
Rahul Chaudhari 🆚 @Telugu_Titans
Dharmaraj Cheralathan 🆚 @HaryanaSteelersExpect Saturday to be housefull!
Don’t miss #vivoProKabaddi 7:30 PM onwards, only on Star Sports Network and Disney+Hotstar!#PATvUP #PUNvTT #JPPvHS #SuperhitPanga pic.twitter.com/NLfGEybuwR
— ProKabaddi (@ProKabaddi) December 25, 2021