క్రీడాభిమానులకు అలరించేందుకు ‘లే పంగా’ అంటూ మన కబడ్డీ జట్లు సిద్ధమైపోయాయి. డిసెంబరు 22 నుంచి ఫిబ్రవరి వరకు కబడ్డీ ఫీవర్ కొనసాగుతుంది. రెండేళ్ల గ్యాప్ తర్వాత 12 జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగనున్నాయి. ఈ సీజన్ టైటిల్ ఫ్యావరెట్ గా తెలుగు టైటన్స్ బరిలోకి దిగుతోంది. ఈ సారి తెలుగు టైటన్స్ బ్రాండ్ అంబాసిడర్ గా అక్కినేని వారబ్బాయి నాగచైతన్య వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అసలు ప్రో కబడ్డీ లీగ్ మొదలైనప్పటి నుంచి తెలుగు టైటాన్స్ ప్రస్తానం ఎలా సాగిందో చూద్దాం.
Hello Titan Army !
We are happy to announce @rohit.c.akki is going to lead YOUR TITANS FOR @prokabaddi season VIII#idiaatakaaduveta #Titanarmy #vivoProkabaddi pic.twitter.com/Cs0B7iCd7j— Telugu Titans (@Telugu_Titans) December 7, 2021
ఇప్పటివరకు జరిగిన 7 సీజన్లలో ఒక్కసారి కూడా తెలుగు టైటాన్స్ కప్పుకోలేక పోయింది. ఈసారి మాత్రం టైటిల్ ఫేవరెట్ గా అడుగుపెడుతోంది. తొలి సీజన్ లో తెలుగు టైటాన్స్ కాస్త తడబడింది. 14 మ్యాచ్ లలో కేవలం ఆరు మాత్రమే గెలవగలిగింది. రెండో సీజన్ లో పుంజుకున్న జట్టు 16 మ్యాచ్ లలో తొమ్మిదింట విజయ కేతనం ఎగురవేసింది. ప్లే ఆఫ్స్ బెర్త్ సాధించినా.. ఫైనల్ కు మాత్రం చేరలేకపోయింది.
Hello Titan Army !
We are happy to announce Siddharth Bahubali Desai as a vice captain for @ProKabaddi season VIII#idiaatakaduveta #titanarmy #vivoprokabaddiisBack pic.twitter.com/fQ9YUTB5UQ— Telugu Titans (@Telugu_Titans) December 7, 2021
మూడో సీజన్ లో తెలుగు టైటాన్స్ ఆశించిన మేర రాణించలేకపోయింది. 14 మ్యాచ్ లలో 7 గెలిచి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. నాల్గో సీజన్ లోనూ సేమ్ రెండో సీజన్ లో జరిగిందే రిపీట్ అయ్యింది. ప్లే ఆఫ్స్ కు చేరినా ఫైనల్ చేరలేకపోయింది. ఐదు, ఆరు సీజన్లలో తెలుగు టైటాన్స్ నిరాశ పరుస్తూనే వచ్చారు. గత సీజన్ లో మరీ పేలవ ప్రదర్శన చేశారు. జాబితాలో చివరి నుంచి రెండోస్థానంతో సరిపెట్టుకున్నారు.
Few hours to go!#SuperhitPanga | #Titanarmy | #vivoProKabaddi | #idiaatakaaduvetaa#pkl8@ProKabaddi pic.twitter.com/9hMlVMjywd
— Telugu Titans (@Telugu_Titans) December 22, 2021
ఈసారి మాత్రం టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న తెలుగు టైటాన్స్ నుంచి అద్భుత ప్రదర్శనను ఆశిస్తన్నారు అభిమానులు. ఈసారైనా కప్పు కల నెరవేరుస్తారా అంటూ ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ కు రోహిత్ కుమార్ కెప్టెన్స్ గా, సిద్ధార్థ్ దేశాయ్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగు టైటాన్స్ కు కామెంట్స్ రూపంలో ఆల్ ది బెస్ట్ తెలియజేయండి.
It’s Time 🔥MATCH DAY🔥#idiaatakaaduvetaa | #Titanarmy | #vivoProKabaddiIsBack | #pkl8 pic.twitter.com/h66PkFde7m
— Telugu Titans (@Telugu_Titans) December 22, 2021