భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో ఎవరుంటారనే విషయం ఒకసారి పరిశీలిస్తే..
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా ఇటీవలే టెస్టు సిరీస్ ముగించుకున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ లో భాగంగా నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. స్వదేశంలో మరికొన్ని నెలల్లో వరల్డ్ కప్ ఉన్న జరగనుండడంతో ఇక నుంచి ప్రతి వన్డే కూడా టీమిండియాకు కీలకం కానుంది. ముఖ్యంగా యంగ్ ప్లేయర్లు వరల్డ్ కప్ లో స్థానం సంపాదించాలంటే ఈ విండీస్ తో జరిగే సిరీస్ లో ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే మ్యాచులో తుది జట్టులో ఎవరికి స్థానం దక్కుతుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఒకసారి తుది జట్టుని పరిశీలిస్తే..
వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ని విజయవంతంగా ముగించుకున్న టీమిండియా ఇక మీద నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్ మీద దృష్టి పెట్టనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా విండీస్ నేడు జరగబోయే తొలి వన్డేకి సిద్ధమవుతుంది. బలహీనంగా ఉన్న ఉన్న విండీస్ జట్టుని తేలికగా తీసుకుంటే అసలుకే ప్రమాదం వస్తుంది. హోప్ తో కూడిన విండీస్ జట్టు స్వదేశంలో గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఈ ఏడాది వరల్డ్ కప్ జరగనుండడంతో సీనియర్లు ఇకపై జరిగే ప్రతి వన్డే మ్యాచులో బరిలోకి దిగబోతున్నారు. నేడు జరిగే తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ ఆటగాడు శుభమాన్ గిల్ ఇన్నింగ్స్ ని ఆరంభించడానికి రెడీగా ఉన్నారు. ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఆడటం పక్కా. ఇక నాలుగు ఐదు స్థానాల్లో సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ లలో ఇద్దరికే అవకాశం దక్కనుంది.
నాలుగో స్థానంలో సూర్య కుమార్ యాదవ్ వైపే యాజమాన్యం మొగ్గు చూపే అవకాశముంది. ఇక వికెట్ కీపర్ గా ఐదో స్థానంలో సంజు శాంసన్ ఆడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్య, జడేజా స్థానాలకు ఎలాంటి డోకా లేదు. శార్దూల ఠాకూర్ గాయంతో ఇబ్బంది పడుతుండడంతో అక్షర్ పటేల్ కి తుది జట్టులో ఛాన్స్ లభించనుంది. ఇక ఫాస్ట్ బౌలర్లుగా సిరాజ్ తో పాటు ఉమ్రాన్ మాలిక్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఏకైక స్పిన్నర్ గా చాహల్, కుల్దీప్ యాదవ్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ కుల్దీప్ ని ఆడించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దూరదర్శన్, జియో టీవీలో ఈ వన్డే మ్యాచ్ ని చూడొచ్చు.
తొలి వన్డే తుది జట్టు:
రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ , సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్