కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. టీమిండియా 234 పరుగుల వద్ద తన సెకండ్ ఇన్నింగ్స్ ని డిక్లర్ చేసింది. దీంతో 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ కి నాలుగో రోజు ఆట చివరిలోనే అశ్విన్ షాక్ ఇచ్చాడు. ఓపెనర్ యంగ్ ని అశ్విన్ వికెట్స్ ముందు దొరకబొచ్చుకున్నాడు.
దీంతో.. డ్రానే లక్ష్యంగా కివీస్, గెలుపే లక్ష్యంగా టీమిండియా ఐదవ రోజు ఆటని ప్రారంభించాయి. కానీ.., నైట్ వాచ్ మెన్ గా క్రీజ్ లోకి వచ్చిన విలియం సోమర్విల్లే క్రీజ్ లో పాతుకునిపోయి తొలి సెషన్ అంతా వికెట్స్ పడకుండా అడ్డు పడిపోయాడు. లంచ్ తరువాత విలియం సోమర్విల్లేని ఉమేశ్ ఓ అద్భుతమైన బంతితో పెవిలియన్ చేర్చడంతో మళ్ళీ గేమ్ ఇండియా చేతిలోకి వచ్చింది.
ఇక్కడ నుండి జడేజా, అశ్విన్ ద్వయం వరుస వికెట్స్ తీసి గెలుపుపై ఆశలు పెంచారు. ఈ క్రమంలో కెప్టెన్ విలియమ్ సన్, సీనియర్ బాట్స్మెన్ రస టేలర్, లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ నికోల్స కూడా వెంట వెంటనే వికెట్స్ కోల్పోయారు. చివరికి ఇంకో 15 నిమిషాల ఆట మిగిలి ఉండగానే కివీస్ 9 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. సరిగ్గా ఇదే సమయంలో లైట్ ఫెయిల్ కావడంతో అంపైర్స్ మ్యాచ్ ని డ్రాగా ప్రకటించారు.
అప్పటికే న్యూజిలాండ్ ప్రధాన ఆటగాళ్లు అంతా పెవిలియన్ ని చేరి ఉన్నారు. అశ్విన్, జడేజా బంతిని బంగారంలా తిప్పుతున్నారు. ఇలాంటి సమయంలో ఇంకో 15 నిమిషాల ఆట గనుక జరిగి ఉంటే టీమిండియా సులభంగా విజయం సాధించేది. కానీ.., అంపైర్స్ మాత్రం మ్యాచ్ ని డ్రాగా ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చారు. మరి.. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Batted mate. #INDvNZ pic.twitter.com/aXDUdvhezp
— BLACKCAPS (@BLACKCAPS) November 29, 2021