అది ఏ ఆట అయినా సరే.. ఆటగాళ్లు ఫుల్ డెడికేషన్ తో ఉంటారు. గెలవడం కోసం ఎంత కష్టమైనా పడుతుంటారు. కొన్నిసార్లు విజయాలు దక్కితే, మరికొన్నిసార్లు అపజయాలు ఎదురవుతుంటాయి. గెలుపోటములు పక్కనబెడితే.. ఆటలో కిక్కు ఉంటుంది చూడండి. ఫైనల్ గా అది ఓ రకమైన సాటిస్పాక్షన్ వస్తుంది. అలా క్రికెట్ పై ఎనలేని మక్కువ చూపిస్తూ హాంకాంగ్ క్రికెటర్స్.. అందరి మనసులు గెలుచుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం దుబాయిలో జరుగుతున్న ఆసియాకప్ లో హాంకాంగ్ టీమ్ కూడా పాల్గొంది. పసికూన అయినప్పటికీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తోంది. టీమిండియాతో ఈ మధ్య మ్యాచులో హాంకాంగ్ జట్టు.. మిగతా పెద్ద జట్లలానే ఆడింది. కాకపోతే ఓడిపోయింది. ఓడిపోయిన సంగతి పక్కనబెట్టి.. భారత ఆటగాళ్ల డ్రస్సింగ్ రూమ్ కి వెళ్లి, వాళ్లతో కలిసిపోయారు. మ్యాచ్ తర్వాత కోహ్లీకి.. తమ జట్టు జెర్సీ కూడా ఇచ్చారు. ఆ ఫొటోలు, వీడియో క్రికెట్ ప్రేమికుల హృదయాలు గెలుచుకున్నాయి.
హాంకాంగ్ క్రికెటర్స్ మరో విషయంలోనూ వావ్ అనిపించారు. ఆ జట్టు మీడియా మేనేజర్ చెప్పిన దాని ప్రకారం.. జట్టులోని బాబర్ హయత్, ఎహసన్ ఖాన్, యసిమ్ ముర్తజా.. ఈ మధ్య నాన్నలు అయ్యారు. ప్రస్తుతం వాళ్లందరూ కూడా ఆసియాకప్ లో ఆడుతున్నారు కాబట్టి.. వాళ్ల వాళ్ల పిల్లల్ని కేవలం వీడియో కాల్స్ ద్వారా మాత్రమే చూశారు. అలానే హాంకాంగ్ జట్టులోని క్రికెటర్స్.. మ్యాచులు లేని టైమ్ లో ఫుడ్ డెలివరీ బాయ్స్ గా, టీచర్స్ గానూ పనిచేస్తున్నారు. దీన్నిబట్టి వాళ్లకు క్రికెట్ పై డెడికేషన్ ఏంటో అర్థమవుతోంది. మరి హాంకాంగ్ క్రికెటర్స్ గురించి ఈ విషయాలు తెలిసి మీరు ఎలా ఫీలయ్యారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: భారత్‌తో మ్యాచ్ తర్వాత ప్రేయసికి ప్రపోజ్ చేసిన హాంకాంగ్ క్రికెటర్! ఆమె ఏం చెప్పిందంటే?