క్రికెట్ లో కొన్నిసార్లు ఎవరికీ సాధ్యం కానీ అసలు ఎవరూ ఊహించనివి క్రియేట్ అవుతుంటాయి. వాటిని చూసి ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోవడం తప్పించి ఏం చేయలేం. ఇప్పుడు కూడా క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్ ఒకటి నమోదైంది. సిక్సులు, ఫోర్లు ఏ ఆటగాడైనా కొడతాడు. అలానే వాటితో సెంచరీలు కూడా చేస్తాడు. కానీ ఆ శతకాలతో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రికార్డ్ అంటే సాహసమనే చెప్పాలి. ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసి చూపించాడు జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. జింబాబ్వే-వెస్టిండీస్ టెస్టు అనగానే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు అదే మ్యాచ్, సరికొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఎందుకంటే విండీస్ తరఫున టెస్టుల్లో ఆడుతున్న చంద్రపాల్ తనయుడు తేజ్ నరైన చంద్రపాల్ డబుల్ సెంచరీతో(467 బంతుల్లో 207 నాటౌట్) అదరగొట్టాడు. టెస్టుల్లో అరుదైన ఫీట్ సాధించాడు. విండీస్ తరఫున డబుల్ సెంచరీ బాదిన తండ్రికొడుకులగా రేర్ రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఇదే మ్యాచ్ లో జింబాబ్వే ఆటగాడు తనకేం తక్కువా అంటూ వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు.
ఈ మ్యాచ్ లో జింబాబ్వే తరఫున శతకం సాధించిన గ్యారీ బ్యాలెన్స్.. అంతకు ముందు మరో నాలుగు సెంచరీలు చేశాడు. అయితే అవి ఇంగ్లాండ్ జట్టు తరఫున ఆడినప్పుడు చేసినవి. 2013-17 వరకు ఇంగ్లీష్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన గ్యారీ.. ఇప్పుడు జింబాబ్వేకు ఆడుతున్నాడు. ఇలా రెండు దేశాల తరఫున 16 మంది క్రికెటర్లు ఆడినప్పటికీ.. ఆ రెండు జట్ల తరఫున సెంచరీలు చేయడం ప్రస్తుత కాలంలో మనోడి వల్లే సాధ్యమైంది. అంతకు ముందు కెప్లర్ వెసెల్స్ ఈ ఘనత సాధించాడు. 1982-85 మధ్య ఆస్ట్రేలియాకు, 1991-94 మధ్య సొంతదేశమైన దక్షిణాఫ్రికాకు ఆడాడు. రెండు కంట్రీస్ తరఫున శతకాలు బాదాడు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 192 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జింబాబ్వేను గ్యారీ ఆదుకున్నాడు. దీంతో 379/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేశారు. అంతకు ముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 447 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. మరి గ్యారీ బ్యాలెన్స్.. రెండు దేశాల తరఫున సెంచరీ చేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Garry Balance struck the perfect balance between two nations as he scored a Test century for both Zimbabwe and England! #Balance #ZIMvswi pic.twitter.com/dIWXaNkAaz
— Abhishek Upadhyay (@Abhishek1o11) February 7, 2023