అత్యంత లగ్జరీ ఇంటిని కొనుగోలు చేశాడు ఓ స్టార్ క్రికెటర్. ఆ ఇంట్లో అత్యాధునిక సదుపాయాలతో పాటుగా స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్ లాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మరి ఇంద్రభవనం లాంటి ఇంటిని కొన్న ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
సెలబ్రిటీలు అనగానే మనకు మెుదట గుర్తుకు వచ్చేది విలాసవంతమైన ఇల్లు, లగ్జరీ కార్లు, టూర్లు గుర్తుకు వస్తాయి. అయితే సెలబ్రిటీలు తమకు ఇష్టమైన ఇల్లు అమ్మకానికి ఉంది అని తెలిస్తే.. వెంటనే దానిని కొనుగోలు చేయాలని ఆరటపడతారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ క్రికెటర్ 6 బెడ్ రూమ్ లు కలిగిన ఇంద్ర భవనం లాంటి ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ ఇంటిని చూస్తే.. వావ్.. అనకుండా ఉండలేం. ఇక ఆ ఇంటి ధర తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే. లగ్జరీ స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, థియేటర్ లాంటి ఎన్నో అత్యాధునిక సదుపాయలతో ఆ ఇల్లు ఇంద్ర భవనాన్ని తలపిస్తోంది. ఇంతకీ ఆ ఇల్లు కొనుగోలు చేసిన ఆటగాడు ఎవరో తెలుసుకుందాం పదండి.
అత్యంత విలాసవంతమైన ఇల్లు.. 6 బెడ్ రూమ్ లు, టెన్నిస్ కోర్టు, స్విమ్మింగ్ పూల్, 1400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పాలరాతిచే నిర్మించారు ఆ ఇంటిని. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో టూరక్ ప్రాంతంలో ఉన్న ఈ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశాడు ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్. రెండు సార్లు ఆసీస్ కు వరల్డ్ కప్ అందించిన హీరోగా క్రికెట్ చరిత్రలో తనదైన ముద్రను వేశాడు పాంటింగ్. ఇక ఇప్పటికే అనేక ప్రాంతాల్లో విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేశాడు. తాజాగా మరో ఇంద్రభవనం లాంటి ఇంటిని కొనుగోలు చేశాడు ఈ ఆసీస్ స్టార్ క్రికెటర్. పైన చెప్పిన విలాసాలతో పాటుగా.. ఇండోర్ – అవుట్ డోర్ లివింగ్ స్పేస్, అత్యంత ఆధునిక వంటగది ఈ ఇంటి ప్రత్యేకతలు.
మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఇల్లు ధర ఎంతో తెలుసా? అక్షరాల 20 మిలియన్ డాలర్లకు పైనే ఉంటుంది అని అక్కడి వార్త పత్రికలు రాసుకొచ్చాయి. ఇక 2013లో పాంటింగ్ 9.2 మిలియన్ డాలర్లు పెట్టి బ్రైటన్ ప్రాంతంలో బీచ్ సైడ్ లో ఓ లగ్జరీ మ్యాన్షన్ ను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం పాంటింగ్ కుటుంబంతో కలిసి ఈ ఇంటిలోనే నివాసం ఉంటున్నాడు. ఈ హౌజ్ కూడా ఇప్పుడు కొన్న ఇంటికి తీసిపోదు. ఇందులో 7 బెడ్ రూమ్ లు, హోం థియేటర్, బీచ్ కు ప్రైవేట్ లేన్ వే ఉన్నాయి. మరి ఆసీస్ దిగ్గజ బ్యాటర్ పాంటింగ్ లగ్జరీ ఇల్లు కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.