వికెట్లు ఎన్ని పడినా క్రీజ్ లో స్టోక్స్ ఉన్నాడంటే రిలాక్స్ అవ్వకూడదు. ఒత్తిడిలో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడంలో స్టోక్స్ కి వెన్నతో పెట్టిన విద్య. యాషెస్ లో నిన్న ముగిసిన లార్డ్స్ టెస్టులో స్టోక్స్ మరోసారి తన విశ్వరూపమే చూపించాడు. ఈ ఆల్ రౌండర్ ధాటికి ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్.. స్టోక్స్ కి సెట్ చేసిన ఫీల్డింగ్ సెట్ హైలెట్ గా మారింది.
ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఎలాంటి ప్లేయర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతూ క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నాడు. గతంలో యాషెస్ లో భాగంగా చివరి వికెట్ తో మ్యాచ్ ని గెలిపించడం.. 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో న్యూజీలాండ్ పై, 2022 పాకిస్థాన్ పై ఫైనల్ మ్యాచులో స్టోక్స్ ఒంటి చేత్తో జట్టు కి విజయాలను అందించాడు. ఇక నిన్న జరిగిన లార్డ్స్ టెస్ట్ మ్యాచులో అసాధ్యం అనుకున్న మ్యాచ్ ని సుసాధ్యం చేసేలా కనిపించినా అది సాధ్యపడలేదు. ఇక అయిదవ రోజు ఆటలో భాగంగా స్టోక్స్ కి సెట్ చేసిన ఫీల్డ్ సెటప్ హైలెట్ గా నిలిచింది. ఇది చూసిన వారు ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
వికెట్లు ఎన్ని పడినా క్రీజ్ లో స్టోక్స్ ఉన్నాడంటే రిలాక్స్ అవ్వకూడదు. ఒత్తిడిలో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడంలో స్టోక్స్ కి వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి ఇన్నింగ్స్ లు గతంలో చాలానే ఆడిన స్టోక్స్ నిన్న లార్డ్స్ లో 5 వ రోజు ఆటలో మరోసారి తన విశ్వరూపమే చూపించాడు. 214 బంతుల్లో 155 పరుగులు చేసి ఆసీస్ కి చెమటలు పట్టించాడు. స్టోక్స్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 9 సిక్సులు ఉండడం విశేషం. గ్రీన్ వేసిన ఒక ఓవర్లో వరుసగా మూడు సిక్సులు కొట్టి స్టేడియం ని హోరెత్తించాడు. ఒక దశలో స్టోక్స్ ఉన్న 9 మంది ఫీల్డర్లు బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేయడం గమనార్హం. ఇలా 9 మంది ఫీల్డర్లు బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది.ఫీల్డర్లందరూ బౌండరీ వెళ్ళకూడదు అనే లక్ష్యంతో ఫీల్డింగ్ చేశారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోర్ 114/4 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్ జట్టుని స్టోక్స్, బెన్ డక్లెట్ నికడగా ఆడుతూ విజయం మీద ఆశలు రేపారు. అయితే 112 బంతుల్లో 9 ఫోర్లతో 83 పరుగులు చేసిన డక్లెట్.. హజల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.జట్టు స్కోర్ అప్పటికీ 177 పరుగులు. అయితే ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో ఊహించని రీతిలో రనౌట్ అవ్వడం ఇంగ్లాండ్ కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇక ఆ తర్వాత టైలండర్స్ తో పోరాడినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆసీస్ యాషెస్ లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకొని 2-0 ఆధిక్యంలో నిలిచింది. మొత్తానికి ఇంగ్లాండ్ ఓడిపోయినా ఆసీస్ ని స్టోక్స్ కంగారెత్తించాడు. మరి స్టోక్స్ కి ఏర్పాటు చేసిన ఫీల్డ్ సెటప్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.