ఐపీఎల్ అంటే క్రికెట్ హంగామా.. ఈ మెగా టోర్నీలో ప్రతి విషయం హైలెటే. ప్రపంచలోనే అత్యధిక ధనిక క్రీడా టోర్నీల్లో ఐపీఎల్ ఒకటి. అలాంటి టోర్నీలో పాల్గొనే జట్లు కూడా అంతే రిచ్‌గా ఉంటాయి. ఐపీఎల్ 2022 కోసం బీసీసీఐ రెండు కొత్త జట్లకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న జట్లుకు తోడుగా.. అహ్మాదాబాద్, లక్నో ఫ్రాంచైజ్‌లు ఐపీఎల్ టైటిల్ వేటకు బరిలో దిగనున్నాయి.
మెగా వేలానికి ముందు అన్ని పనులు పూర్తి చేసుకుంటున్న రెండు ఫ్రాంచైజ్‌లు వాటి లోగోలు, జెర్సీ డిజైన్లపై దృష్టి పెట్టాయి. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ లోగోను విడుదల చేసింది. ఐపీఎల్‌లో ఒక కొత్త జట్టు లోగో రిలీజ్ కావడంతో.. ఐపీఎల్‌లో తమ జట్టు లోగోనే సూపర్ అంటే తమదే సూపర్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. లోగో ఒక జట్టుకు గుర్తింపు చిహ్నంగా ఉంటుంది. ఆ జట్టు బ్రాండ్ మార్క్‌గా నిలుస్తుంది. అందుకే అన్ని జట్లు తమ తమ లోగోలపై ప్రత్యేక శ్రద్ధపెడ్తాయి.
కాగా ఐపీఎల్‌లో అన్ని జట్లకు ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. దీంతో లోగోల విషయంలో కూడా వారి మధ్య గట్టి చర్చే నడుస్తుంది. తమ అభిమాన జట్టు జెర్సీ, లోగోనే ఐపీఎల్ బెస్ట్ లోగో అని కొందరు క్రికెట్ ఫ్యాన్స్ తమ అభిమాన ఐపీఎల్ జట్టును సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరి ఈ లోగోలపై క్రికెట్ ఫ్యాన్స్ వార్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Soaring towards greatness. 💪🏼
Lucknow Super Giants is all set to stretch its wings. 🔥
Prepare for greatness! 👊🏼#LucknowSuperGiants #IPL pic.twitter.com/kqmkyZX6Yi— Lucknow Super Giants (@LucknowIPL) January 31, 2022
Best ever jersey & logo in IPL
Deccan chargers 💥💥 .Agree?#IPL2022 pic.twitter.com/uTtnMCfI87
— َ𝗱𝗮𝗻ı_Î_𝗖𝗵𝗮𝗺𝗽§َ (@DanielSamsDolan) January 31, 2022
😂 @LucknowIPL what an idea sir G #LucknowSuperGiants #IPL2022 #IPLAuction pic.twitter.com/bTZQivNbiM
— M.R.SHREE NATH (@MRSHREENATH1) February 1, 2022
Best logos in IPL🔥 pic.twitter.com/aO4NU7T0q9
— TukTuk Academy (@TukTuk_Academy) January 31, 2022