మొత్తానికి 2021 ఏడాది ముగింపు దశకు చేరుకుంది. ఇంకో నాలుగు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. 2021 కొందరికి కలిసి వస్తే.. మరికొందరికీ అంతగా కలిసిరాలేదు. క్రికెట్‌లో 2021 ఇంగ్లండ్ క్రికెట్‌కు ఏమాత్రం కలిసి రాలేదు. టెస్ట్ ఫార్మాట్‌లో అయితే ఆ జట్టు 2021 ఏడాదికే అత్యంత చెత్త టీమ్‌గా నిలిచింది. ఒక ఏడాదిలో ఏకంగా 9 టెస్టు మ్యాచ్‌లలో ఓడి చెత్త రికార్డును తన పేరున లిఖించుకుంది. గతంలో 2003లో ఈ చెత్త రికార్డ్ బంగ్లాదేశ్ పేరిట ఉంది. ఆ ఏడాది మొత్తం 9 టెస్టు మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ 9 మ్యాచ్‌లలోనూ ఓడి చెత్త రికార్డును మూటగట్టుకుంది.
Know more about the nominations for the ICC Men’s Test Cricketer of the Year 2021 award 👇
— ICC (@ICC) December 28, 2021
ఇప్పుడు ఇంగ్లండ్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో మూడో టెస్టులోనూ ఓడి ఆ రికార్డును సమం చేసింది. ఈ ఏడాది మొత్తం 15 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ 9 మ్యాచ్‌లలో ఓడింది. అలాగే ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ ఆడిన చివరి 13 మ్యాచ్‌లలో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేదు. మరి ఇంగ్లండ్ మూటగట్టుకున్న ఈ చెత్త రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.