ప్రఖ్యాతిగాంచిన ఆటగాళ్లు వాడిన వస్తువులకు, క్రీడా సామాగ్రికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ.. ఒక క్రికెట్ బ్యాట్ ఏకంగా రూ.కోటి 89 లక్షలకు వేలంలో అమ్ముడైంది. ఇంతకీ ఈ బ్యాట్‌ను ఏ క్రికెటర్ వాడారు అనే కదా మీ డౌట్.. క్రికెట్లోనే చిరస్థాయిగా నిలిచిపోయిన ది గ్రేట్ డాన్ బ్రాడ్‌మెన్ వాడిన బ్యాట్ అది. 1394లో యాషెస్ సిరీస్‌లో బ్రాడ్‌మెన్ వాడిన బ్యాట్‌ను వేలం వేశారు.
ఆస్ట్రేలియా చెందిన దిగ్గజ ఆటగాడు బ్రాడ్‌మెన్ మొట్టమెదటి యాషెస్ సిరీస్‌లో ఈ బ్యాట్‌తో ఆడి ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాదేశాడు. 304 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. గత 25 ఏళ్లుగా మ్యూజియంలో ఉన్న బ్యాట్‌ను వేలంలో ఆస్ట్రేలియన్ కలెక్టర్ దక్కించుకున్నారు. అలాగే సెప్టెంబర్‌లో వేలం వేసిన బ్రాడ్‌మెన్ బ్యాట్ ఒకటి రూ.కోటి 54 లక్షలకు అమ్ముడైంది. ఆ రికార్డ్‌ను మళ్లీ బ్రాడ్‌మెన్ బ్యాటే బద్దలుకొట్టడం విశేషం. మరి దిగ్గజ బ్యాట్స్‌మెన్ బ్యాట్ ధర ఇంతలా పలకడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.