"సౌద్ షకీల్" ప్రస్తుతం ఈ పేరు టెస్టు క్రికెట్ లో సంచలనంగా మారుతుంది. ఇప్పటి వరకు ఆడింది 7 టెస్టులే అయినప్పటికీ 100 టెస్టులు అనుభవం ఉన్న ప్లేయర్ లాగా పరిణితి చూపిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు టెస్టు క్రికెట్ లో ఎవరూ సాధించలేని ఒక రికార్డ్ నెలకొల్పి చరిత్ర సృష్టించాడు.
పాకిస్థాన్ క్రికెట్ కి మంచి రోజులు వచ్చినట్టు కనిపిస్తుంది. టెస్టు క్రికెట్ లో ఆ జట్టు ఆడుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్య పోవాల్సిందే. ఓపెనర్ల నుండి ఏడో నెంబర్ వరకు పాక్ బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ “సౌద్ షకీల్” ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. సచిన్, లారా, కోహ్లీ లాంటి దిగ్గజాలను మరిపిస్తూ ఏకంగా ఆస్ట్రేలియన్ దిగ్గజం బ్రాడ్ మాన్ ని గుర్తు చేస్తున్నాడు. ఆడిన ప్రతి మ్యాచులో సత్తా చూపిస్తూ తగ్గేదే లేదంటున్నాడు. బ్యాటింగ్ కి దిగాడంటే ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు. క్రీజ్ లో పాతుకుపోయి బౌలర్లకు కొరకరాని కొయ్యలా తయారవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడింది 7 టెస్టులే అయినప్పటికీ 100 టెస్టులు అనుభవం ఉన్న ప్లేయర్ లాగా పరిణితి చూపిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు టెస్టు క్రికెట్ లో ఎవరూ సాధించలేని ఒక రికార్డ్ నెలకొల్పి చరిత్ర సృష్టించాడు.
“సౌద్ షకీల్” ప్రస్తుతం ఈ పేరు టెస్టు క్రికెట్ లో సంచలనంగా మారుతుంది. బాబర్ అజాం లాంటి గొప్ప ప్లేయర్ ఉన్న పాకిస్థాన్ కి ఇప్పుడు అంతకు మించి అనేలా “సౌద్ షకీల్” రాణిస్తున్నాడు. ప్రస్తుతం లంక పర్యటనలో భారీ ఇన్నింగ్స్ లు ఆడేస్తున్నాడు. తొలి టెస్టులో 100 పరుగులకే సగం జట్టుని కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ జట్టుని తన డబల్ సెంచరీతో ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించాడు. ఇక ప్రస్తుతం కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. దీంతో 146 టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా 7 టెస్టులో కనీసం అర్ధ సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. అంతేకాదు బ్యాటింగ్ కి దిగాడంటే కనీసం 20 పైగా స్కోర్లు చేస్తున్నాడు.
మొత్తం 7 టెస్టుల్లో 13 ఇన్నింగ్స్ లు ఆడి 875 పరుగులు చేసాడు. వీటిలో 6 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ చూసుకుంటే దాదాపు 90 ఉండడం విశేషం. 27 ఏళ్ళ సౌద్ షకీల్ బ్యాటింగ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని రికార్డులు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్థాన్ జట్టు మరో విజయం సాధించేలా కనపడుతుంది. తొలి ఇన్నింగ్స్ లో 410 పరుగుల భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్ పై పట్టు బిగించింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ డబుల్ సెంచరీ(201)తో కదం తొక్కగా.. అగ సల్మాన్ మెరుపు సెంచరీ(132) చేసాడు. మొత్తానికి సౌద్ షకీల్ పట్టుమని పది మ్యాచులు కూడా ఆడకుండా ప్రపంచ రికార్డులు కొల్లగొట్టేస్తున్నాడు. మరి షకీల్ ఫామ్ ఇప్పటివరకు ఇలా కొనసాగితుందో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.