దినేష్ కార్తీక్.. ఈ పేరు ప్రస్తుతం టీమిండియాలో సంచలనం మాత్రమే కాదు.. ఎందరికో ఆదర్శం కూడా. అతని కెరీర్ ముగిసిపోయిందని అంతా భావించారు. రేపో.. మాపో క్రికెట్ కి గుడ్ బై చెప్పేస్తాడని అంతా అనుకున్నారు. కానీ, దినేష్ కార్తీక్ కంబ్యాక్ చేశాడు. దినేష్ కార్తీక్ కేవలం జట్టులోకి ఓ సభ్యుడిగా రావడమే కాదు.. రికార్డులు కూడా బద్దలు కొడుతున్నాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో దినేష్ కార్తీక్ చెలరేగి ఆడాడు. సఫారీ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టాడు. బ్యాటింగ్ లో ఏబీడీని గుర్తుచేస్తూ.. మైదానంలో విధ్వంసం సృష్టించాడు. రన్స్ చేయలేక టాప్ ఆర్డర్ కుప్పకూలగా.. హార్దిక్ పాండ్యాతో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ నమోదు చేశాడు.
దినేష్ కార్తీక్ నాలుగో టీ20లో కేవలం 27 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంలో 55 పరుగులు చేశాడు. అంతేకాకుండా 2006లో సౌత్ ఆఫ్రికాపై తొలి టీ20 ఆడిన డీకే.. 2022లో దాదాపు 16 ఏళ్ల తర్వాత అదే సౌత్ ఆఫ్రికాపై టీ20ల్లో తన తొలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. ఇప్పుడు ఆ అర్ధశతకంతోనే ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న రికార్డును డీకే బద్దలు కొట్టాడు. టీ20ల్లో 36 ఏళ్ల 229 రోజుల వయసులో ధోనీ దక్షిణాఫ్రికాపై 2018లో అర్ధశతకం నమోదు చేశాడు. ధోనీ అంతర్జాతీయ టీ20 కెరీర్లో అది రెండో అర్ధశతకం.
Between Dinesh Karthik’s first T20I and his first T20I fifty, we all grew up pic.twitter.com/3toXIiqCz3
— ESPNcricinfo (@ESPNcricinfo) June 17, 2022
ఇప్పుడు దినేష్ కార్తీక్ 37 సంవత్సరాల 16 రోజుల వయసులో సౌత్ ఆఫ్రికాపై రాజ్ కోట్ లో 27 బంతుల్లో 55 పరుగులు చేసి ఆ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో ఆరు లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ కి వచ్చి.. అతి పెద్ద ఇన్నింగ్స్ ఆడిన భారత ఆటగాడిగా దినేష్ కార్తీక్ నిలిచాడు. గతంలో ధోనీ పేరిట ఉన్న 2018లో సెంచూరియన్ లో సౌత్ ఆఫ్రికాపై ధోనీ 43 బంతుల్లో 52* పరుగులు చేశాడు. ఇప్పుడు డీకే ఆ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
.@DineshKarthik put on an impressive show with the bat & bagged the Player of the Match award as #TeamIndia beat South Africa in Rajkot. 👏 👏
Scorecard ▶️ https://t.co/9Mx4DQmACq #INDvSA | @Paytm pic.twitter.com/RwIBD2OP3p
— BCCI (@BCCI) June 17, 2022
ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. 5 టీ20ల సరిసీస్ లో మొదటి రెండు టీ20 మ్యాచుల్లో ఓడిన భారత్.. తర్వాతి రెండు మ్యాచుల్లో వరుస విజయాలు నమోదు చేసింది. నాలుగో టీ20లో 82 పరుగుల ఆధిక్యంతో ఘన విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. టాప్ ఆర్డర్ నిలదొక్కుకోవడానికి బాగా ఇబ్బంది పడింది. ఇషాన్ కిషన్(27) పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 46 పరుగులు), దినేష్ కార్తీక్(27 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 55 పరుగులు) ఇద్దరూ కలిసి.. 81 పరుగులకు 4 వికెట్ల స్థితి నుంచి ఐదు వికెట్ నష్టానికి స్కోరు 146 పరుగలకు చేర్చారు. 37 ఏళ్ల వయసులో దినేష్ కార్తీక్ రికార్డులు బద్దలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Oldest Indian to Score 50+ in T20I
37yr 016d – Dinesh Karthik*
36yr 229d – MS Dhoni#INDvSA pic.twitter.com/QlvVZn7YxL— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) June 17, 2022
Highest score at No.6 or lower by Indians in T20Is:
55 – Dinesh Karthik v SA, today
52* – MS Dhoni v SA, 2018
50* – Manish Pandey v NZ, 2020
49 – MS Dhoni v NZ, 2017
48* – MS Dhoni v AUS, 2012#INDvSA— Kausthub Gudipati (@kaustats) June 17, 2022